అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతులు

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతులు
x
Highlights

వ్యవసాయమే దండుగ అనుకుంటున్న ఈ జనరేషన్‌లో వ్యవసాయశాస్త్రం అభ్యసించడమే కాదు, దానిపై రైతులకు అవగాహన కల్పించేందుకు, వారికి మరిన్ని లాభాలు...

వ్యవసాయమే దండుగ అనుకుంటున్న ఈ జనరేషన్‌లో వ్యవసాయశాస్త్రం అభ్యసించడమే కాదు, దానిపై రైతులకు అవగాహన కల్పించేందుకు, వారికి మరిన్ని లాభాలు తెచ్చిపెట్టేందుకు , ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు ముగ్గురు యువకులు. డిగ్రీ, పీజీ పట్టాలు పుచ్చుకున్నా కూడా కార్పొరేట్ ఉద్యోగాలకు బైబై చెప్పి ప్రకృతి విధానంలో పంటల సాగు చేసి సామాజిక సేవ చేయాలనుకుంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో నేపధ్యం అయినా వారి లక్ష్యం మాత్రం అందరికీ ఆరోగ్యకరమైన, నాణ్యమైన పంట ఉత్పత్తులను అందించడమే ఆ దిశగా అడుగులు వేస్తున్న యువకులపై ప్రత్యేక కథనం.

పీజీ వరకు చదువుకున్నాడు యువరైతు భాను కిరణ్ కొంత కాలం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసాడు. అందులో సంతృప్తి దొరక్క ఒక సోషల్ ఆర్గనైజేషన్ లో పని చేయటం మొదలు పెట్టాడు అక్కడ ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడతుతుండడం గమనించాడు అంతే కాదు చిన్న వయసులోనే పిల్లలకు పౌష్టికాహారం దొరక్క ఎలా ఇబ్బంది పడుతున్న అంశం అతడిని కలచివేసింది. దీనంతటికి కారణం తీసుకునే ఆహారమేనన్న విషయం గుర్తించాడు దీంతో రసాయనాలు లేని పంటలు పండిచటమే దీనికి సరైన మార్గామని తెలుసుకొని ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ పొందుతూ కష్టపడి వ్యవసాయం చేస్తున్నాడు.

ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు దగ్గర సాగు పాఠాలను నేర్చుకుని వాటిని అనుసరిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు భాను కిరణ్. ఇప్పటికే ప్రకృతి ఎరువుల తయారీపైన మంచి పట్టు సాధించాడు. రైతే స్వయంగా ఎరువును తయారు చేసుకునే విధానాలపై అవగాహన తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి సాగు చేయాలనుకునే రైతు దగ్గర ఆవు లేకపోయినా అతి తక్కువ ఖర్చుతో ఎరువును తయారు చేసుకునే సాగు పద్ధతుల గురించి తెలుసుకున్నాడు.

కార్పొరేట్ సంస్థలతో పాటు ఆయా రంగాలలో పని చేసిన అనుభవం వరంగల్ జిల్లాకు చెందిన యువరైతు భాస్కర్ ది తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయమంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో వారి ప్రోత్సాహం లేకపోయినా తన వంతుగా సామాజిక మాధ్యమాల్లో ప్రకృతి సాగు పద్ధతుల గురించి తెలుసుకునేవాడు అయితే చూడడం వేరు ప్రత్యక్షంగా చేయడం వేరు అని తెలుసుకున్న భాస్కర్ ప్రకృతి వ్యవసాయంపై పూర్తి అవగాహన వచ్చే విధంగా శిక్షణను పొందాడు. సాగులో కష్టపడుతూ తనకు ఇష్టమైన పనిని చేస్తూ తన ఇంటి వారిని మెప్పించాడు ప్రకృతి వ్యవసాయం చేయటం అంటే అందరికీ ఆరోగ్యాన్ని అందించడమే అని అంటాడు భాస్కర్. ఈ జీవితానికి ఆ సంతృప్తి చాలంటున్నాడు.

అందరు యువకులు డబ్బు సంపాదనే ధ్యేయంగా పరుగులు పెట్టడమే కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారం పండించడానికి ముందుకు రావాలంటున్నాడు నిర్మల్ జిల్లాకు చెందిన వినయ్. నేటితరం అన్ని రంగాల్లో రాణించినట్లే సాగు రంగంలో కూడా తమ సత్తాని చూపెట్టాలని సూచిస్తున్నారు రసాయనాలు లేని ప్రకృతి సాగు చేసి అందరికీ నాణ్యమైన , ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. అందుకే ఈ రంగంలోకి వచ్చానని వినయ్ వివరిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories