అంగవైకల్యం అడ్డు రాలేదు...సాగు రంగంలో....

అంగవైకల్యం అడ్డు రాలేదు...సాగు రంగంలో....
x
Highlights

మనసులో సంకల్పం ఉండాలే కానీ ఏ రంగంలో అయినా మన సత్తాను చూపించవచ్చని నిరూపిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు. తానకు అంగవైకల్యం అడ్డుగా ఉందని...

మనసులో సంకల్పం ఉండాలే కానీ ఏ రంగంలో అయినా మన సత్తాను చూపించవచ్చని నిరూపిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు. తానకు అంగవైకల్యం అడ్డుగా ఉందని అధైర్యపడలేదు అవయవాలు అన్నీ ఉన్నా ఏ పని చేయని సోమరులకు ఈ రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎవరిపై ఆధారపడకుండా వ్యవసాయం చేస్తూ ఆర్ధికంగా నిలదొక్కుకుంటున్నాడు. బొప్పాయి సాగులో అధిక దిగుబడులను సాధిస్తూ కుటుంబానికి భరోసా కల్పిస్తున్నాడు. ఏ పనికైనా అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తున్నాడు రైతు మోహన్.

ఈ రైతు పేరు ధరావత్ మోహన్. మహబూబాబాద్ జిల్లా మాధాపురం గ్రామ శివారు ధరావత్ తండాకు చెందిన మోహన్ పుట్టుకతోనే వికలాంగుడు. అయినా కూడా ఎవరిపై ఆధారపడకుండా తనకున్న 6 ఎకరాల సాగు భూమిలో వివిధ రకాల పంటలను సాగు చేసి తన కుటుంబానికి ఆర్ధిక భరోసాను కల్పిస్తున్నాడు.

మొదట మిర్చి, పత్తి పంటలు వేసిన ఈ రైతు కూలీల సమస్య అధికంగా ఉండడంతో కాస్త ఇబ్బందుతు పడ్డాడు ఏలాగైనా తనకున్న భూమిలో కూలీల కొరత లేకుండా పంటలను పండిచాలనుకున్నాడు. ఆలోచించి అదే భూమిలో బొప్పాయి పంటను సాగు చేపట్టాడు. కూలీల తో అవసరం లేకుండా సొంతంగా తనే తన పొలంలో పనిచేస్తున్నాడు. బొప్పాయి పంటలో అధిక దిగుబడి సాధిస్తున్నాడు.

రాజమండ్రి నుంచి బొప్పాయి మొక్కలను తీసుక వచ్చి ఎకరాకు 1100 మొక్కల చొప్పున నాటాడు. మొత్తం 3 ఎకరాలలో 3300 మొక్కలు నాటాడు. మొక్కలు నాటిన రోజు మాత్రమే కూలీల సహాయం తీసుకున్నాడు. డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీటిని అందిస్తున్నాడు.

ప్రస్తుతం పంట కాపుకు వచ్చింది. ఒక్కో కాయ కిలో నుంచి 2 కిలోల వరకు బరువు తూగుతోంది. బొప్పాయి పండ్లను తాను స్వయంగా తెంపి మార్కెట్లో విక్రయిస్తున్నాడు. రోజుకు 1500 నుంచి 2000 రూపాయాల వరకు ఆదాయం పొందుతున్నాడు. దీంతో తాను తన కుటుంబం సంతోషంగా జీవిస్తున్నామని, తన కొచ్చిన ఆలోచనతో కూలీల బాధ తప్పిందని మోహన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

బొప్పాయి పంటను పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ అందించడంతో పాటు మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తే బాగుంటుందంటున్నాడు రైతు మోహన్. తన కష్టాన్ని గుర్తించి తగిన విధంగా ప్రభుత్వం సహాయాన్ని అందించాలని కోరుతున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories