వరదలు, కరువులతో కుదేలవుతున్న రైతన్నలు

వరదలు, కరువులతో కుదేలవుతున్న రైతన్నలు
x
Highlights

కృష్ణానదికి వరద వచ్చిన ప్రతీసారి పొలాలు నీట మునగడం రాజకీయ పార్టీ నేతలు హాడావుడి చేయడం సహజం. అటు రైతుల గోడును తామే విన్నట్లు ప్రచార ఆర్భాటాలు చేయడమూ...

కృష్ణానదికి వరద వచ్చిన ప్రతీసారి పొలాలు నీట మునగడం రాజకీయ పార్టీ నేతలు హాడావుడి చేయడం సహజం. అటు రైతుల గోడును తామే విన్నట్లు ప్రచార ఆర్భాటాలు చేయడమూ కామన్‌. ఇటు హామీలు కూడా అదిరిపోయే రీతిలో ఇస్తుంటారు మన పొలిటీషియన్స్‌. సీన్‌ కట్‌ చేస్తే మూడేళ్ల క్రితం వరద, కరువులతో నష్టపోయిన గుంటూరు రైతులకు ఇప్పటికీ నష్ట పరిహారం అందలేదు.

వరదలు, కరువులతో ఆరుగాలం కష్టపడ్డ రైతన్నలు కుదేలవుతున్నారు. అటు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ అందడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతన్న కళ్లల్లో కన్నీల్లే మిగులుతున్నాయి. 2018లో కరువు, 2019లో వరదల వల్ల పత్తి, వరి, మినుము తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు ఆగస్టులో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల తీరం వెంబడి పొలాలు, లంకగ్రామాల పరిధిలోని ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

33శాతం కంటే అధికంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందిస్తోంది. అయితే వివిధ కారణాలతో సొమ్ము పంపిణీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికీ ఒక్క గుంటూరు జిల్లాకు చెందిన రైతులకే గతేడాది నష్టపరిహారం 60కోట్ల రూపాయలు అందాలి. మరోవైపు ఇటీవల వచ్చిన వరదల తాకిడికి సుమారు ఆరువేల హెక్టార్లకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతన్నలు ప్రభుత్వం వెంటనే గత బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వరదల సమయంలో నేతలు వచ్చి హామీలు ఇస్తున్నా ఆచరణలో అమలు కావడం లేదంటున్నారు బాధిత రైతులు. ఒకవేళ పరిహారం డబ్బు విడుదల చేసిన సరైన సమయంలో పంపిణీ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఆర్థిక సంవత్సరం పూర్తికావడంతో మళ్లీ బిల్లులు సమర్పించాలని అధికారులు సూచించినట్లు చెబుతున్నారు. అటు ఉద్యానపంటల రైతులకు 10కోట్ల రూపాయలు విడుదలైనా సాంకేతిక కారణాలతో తమ ఖాతాలో డబ్బు జమ కాలేదంటున్నారు బాధితులు. దేశానికే వెన్నముక్కగా చెప్పుకుంటున్న రైతన్న గోడును ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలి. సరైన సమయంలో పంట నష్ట పరిహరం చెల్లించి వారిని ఆదుకోవాలి. పంటలు పండిస్తూ అందరి ఆకలి తీరుస్తున్న రైతన్న సమస్య ఇప్పటికైనా మారాలని మనమందరం కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories