బొప్పాయి 'పాల' తోటలు

బొప్పాయి పాల తోటలు
x
Highlights

బొప్పాయి కాయలకి పాలు కారతాయని తెలుసు. కానీ పండ్ల కోసమే కాకుండా పాల కోసం కూడా బొప్పాయి తోటలు పెంచుతారని తెలియదు.

బొప్పాయి కాయలకి పాలు కారతాయని తెలుసు. కానీ పండ్ల కోసమే కాకుండా పాల కోసం కూడా బొప్పాయి తోటలు పెంచుతారని తెలియదు. ఆ పాలను ఔషధాలు, సౌందర్య క్రీముల తయారీలో వాడుతున్నారు. ఈ పాలకు భారీ డిమాండ్ ఉండటంతో పెద్ద ఎత్తున బొప్పాయి పాల ఎగుమతి జరుగుతోంది. ఈ యేడాది అకాల వర్షాలు, ఇదురుగాలుల వల్ల నష్టపోయిన బొప్పాయి రైతాంగాన్ని ఈ పాలే ఇప్పుడు ఆర్ధికంగా ఆదుకుంటున్నాయి.

బొప్పాయి సాగుకు కడప జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాలు ప్రసిద్ది. రైల్వేకోడూరుతో పాటు ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల నుంచి బొప్పాయి సాగు విస్తీర్ణం పెరిగి పది వేల హెక్టార్లు దాటింది. రోజూ 50 నుంచి 100 లారీల్లో బొప్పాయి కాయలు సీజన్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వ్యాపారులు రైల్వేకోడూరులోనే మకాం వేసి కొనుగోలు చేస్తుంటారు. అయితే బొప్పాయి పండ్లతో పాటు బొప్పాయి పాలు కూడా రైల్వేకోడూరు రైతులు అమ్ముతున్నారు.

బొప్పాయి పండ్లకే కాదు బొప్పాయి పాలకు భలే గిరాకీ ఉంది. కాయల నుంచి కారిన పాలు కాసేపటికి గడ్డ కడతాయి. గడ్డకట్టిన పాలను డబ్బాల్లో నింపుతారు. వాటిని ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలో ఉన్న పరిశ్రమలకు తరలిస్తారు. దానిని అల్లోపతి మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అదే విధంగా 14 రకాల మందులు, సౌందర్య క్రీములు, సోప్‌లలో ఉపయోగిస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. పాలలో సాంధ్రత ఎక్కువగా ఉంటేనే ధరలు బాగా ఉంటాయి. ఇక్కడి నుంచి పంపిన పాలను పరిశ్రమల్లో పిండి చేసి అమెరికాకు ఎక్కువగా పంపుతున్నారని ఇక్కడి రైతులు చెబుతున్నారు. అందువల్ల పాలకు డిమాండు పెరిగింది.

ధరల పతనం, అకాల ఇదురు గాలులు, వర్షాలతో వచ్చే నష్టాలను చవిచుస్తున్న రైతులకు ఇలా పాలు అమ్ముకోవడం కొంత వరకు ఉపశమనమనే అభిప్రాయం వ్యక్తమవుతొంది. కానీ పాలు తీయకుండా అమ్మే బొప్పాయి పండ్ల ధర టన్ను 5 వేలు పలుకుతుంది. పాలు తీసిన పండ్ల అయితే కొంత ధర తక్కువగా ఉంటుంది. పంట బాగా కాస్తే ఎకరాకు 70 టన్నుల నుంచి 100 టన్నుల దిగుబడి వస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories