రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు

రైతులకు శాపంగా మారిన అకాల వర్షాలు
x
Highlights

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు...

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన పట్టణాలతో పాటు పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లో ఇల్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు పత్తి, వరి, మొక్క జొన్న పంటలుకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా ఊర్లకు ఊర్లు నీట మునిగాయి. జిల్లాలోని సత్తుపల్లి,కల్లూరు,పెనుబల్లి,వేంసూరు, తల్లాడ మండలాల్లో అకాల వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటి పాలయ్యింది. పంట చేతికి వచ్చే సమయానికి కురుస్తున్న భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరోవైపు భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి జేవిఆర్, కిష్టారం ఓపెన్ కాస్ట్, కొత్తగూడెం సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఓపెన్ కాస్ట్ లోకి నీరు చేరటంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలుపుతున్నారు. సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు వారు తెలిపారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం ఓపెన్ కాస్ట్ లో చేరిన నీటిని తొలగించి తిరిగి బొగ్గు ఉత్పత్తి మొదలు పెడతామని సింగరేణి ప్రాజెక్టు ఆఫీసర్లు తెలుపుతున్నారు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో కురిసిన వర్షాలకు నాలుగు వేల ఎకరాల్లో వరి పంట నేల వాలింది. రుద్రారం తాండూరు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం లో వర్షం నీరు చేరడంతో ధాన్యం తడిసి ముద్దయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories