నిజామాబాద్ జిల్లాలో టాలెంట్ చూపిస్తున్న మిల్లర్లు

నిజామాబాద్ జిల్లాలో టాలెంట్ చూపిస్తున్న మిల్లర్లు
x
Highlights

దళారులు పోయి మిల్లర్లు పుట్టుకవచ్చారు. ఒకప్పుడు రైతులను దళారులు మోసగించేవారు. ఇప్పుడు ఆ పాత్రను మిల్లర్లు పోషిస్తున్నారు. కొనుగోళ్లలో మిల్లర్లు ఆడిందే...

దళారులు పోయి మిల్లర్లు పుట్టుకవచ్చారు. ఒకప్పుడు రైతులను దళారులు మోసగించేవారు. ఇప్పుడు ఆ పాత్రను మిల్లర్లు పోషిస్తున్నారు. కొనుగోళ్లలో మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంలా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని దోపీడి ఇందూరులో జరుగుతుంది. ఇక్కడ 'కడ్తా' పేరుతో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో 445 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 240 మిల్లులకు ధాన్యం తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు తమ టాలెంట్ చూపిస్తున్నారు. 'కడ్తా' పేరుతో రైతులను దోచుకుంటున్నారు. క్వింటాలు ధాన్యానికి 3 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కోతలు మొదలై కొనుగోళ్లు సైతం ఊపందుకున్నాయి. కొన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత వేధిస్తుంటే మరికొన్ని కేంద్రాల్లో 'కడ్తా' విధానం రైతులను దోచేస్తోంది.

సన్న రకాన్ని సాగు చేసి నిండా మునిగామని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి పెరిగిపోవడంతో పాటు వర్షాల కారణంగా పంట దిగుబడి పడిపోయిందంటున్నారు. ఇదీ చాలదన్నంటూ ఇప్పుడు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 'కడ్తా' పేరుతో తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆశయం గొప్పదైనప్పటికీ మిల్లర్ల దోపిడీ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ పేరుతో జరిగే దోపిడీకి అధికారులు ఇప్పటికైనా పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరముంది.


Show Full Article
Print Article
Next Story
More Stories