కుళ్ళిన మిర్చి నారు.. రైతన్నలను ఘాటుగా దోచుకుంటున్న నర్సరీ యాజమాన్యాలు !

కుళ్ళిన మిర్చి నారు.. రైతన్నలను ఘాటుగా దోచుకుంటున్న నర్సరీ యాజమాన్యాలు !
x
Highlights

మిర్చి రైతులపై కష్టాలు ప్రళయకాల మేఘంలా విరుచుకుపడ్డాయి. వెంటాడుతున్న కాసుల కష్టాలతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. పంట సాగు కోసం సిద్ధం...

మిర్చి రైతులపై కష్టాలు ప్రళయకాల మేఘంలా విరుచుకుపడ్డాయి. వెంటాడుతున్న కాసుల కష్టాలతో రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. పంట సాగు కోసం సిద్ధం చేసుకున్న పొలం దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. విశ్వాసం సడలనీయకుండా సంకల్పంతో ముందుకు అడుగేస్తుంటే రైతుల రెక్కల కష్టంతో నర్సరీ యాజమాన్యం విందుభోజనం చేస్తోంది.

ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో రైతులు మిర్చి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ఏడాది అధిక వర్షాలతో మిర్చినారు కుల్లిపోవడంతో రైతులు నర్సరీ బాటపట్టారు. ఇదే అదునుగా మిర్చి నర్సరీ యజమాన్యం అధిక రేటు పెంచి రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో మిరప నారు కొనాల్సిన వస్తుందని రైతులు చెబుతున్నారు.

నర్సరీలలో ఒక్కో మొక్కను 2,3 రూపాయలకు విక్రయిస్తున్నారని రైతులు చెబుతున్నారు. మొక్కల ధరలు ఒక్కసారిగా పెంచడంతో రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రైవేటు నర్సరీ లపై అజమాయషీ లేకపోవడం, ఉద్యానశాఖ అధికారులు రైతుల ఇబ్బందులను పట్టించుకోక పోవడుతో మొక్కల ధర సమస్యగా మారింది.

మిరప నారు కుళ్లిపోవడంతో ఎకరానికి భారీ నష్టం వాటిల్లితుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరీలపై ఆధారపడితే తమను అడ్డగోలుగా దోచుకుంటున్నారని వాపోతున్నారు. ఇంత భారీ పెట్టుబడులు మధ్య పంట సాగు చేయాలంటే ఇబ్బందిగా ఉందని రైతులు చెబుతున్నారు. ఒకవైపు కరోనా కష్టాలు మరోవైపు పెట్టుబడి కష్టాలతో పంట సాగు చేయడానికి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories