ప్రకృతి సేద్యన్ని నమ్ముకున్నాడు...సిరుల పంటలు...

Farmer Srinivasulu
x
Farmer Srinivasulu
Highlights

ఓ వైపు అనంతలో కరవు తాండవిస్తున్నా చోళ సముద్రం గ్రామానికి చెందిన రైతు మాత్రం సిరుల పంటలు పండిస్తున్నాడు. బొప్పాయి సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు ప్రకృతి విధానాలను అనుసరిస్తూ ఉన్న కొద్దిపాటి నీటిని ఆధునిక పద్ధతులను పాటిస్తూ సమర్థవంతంగా బొప్పాయి సాగు చేస్తున్నాడు.

ఓ వైపు అనంతలో కరవు తాండవిస్తున్నా చోళ సముద్రం గ్రామానికి చెందిన రైతు మాత్రం సిరుల పంటలు పండిస్తున్నాడు. బొప్పాయి సాగులో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు ప్రకృతి విధానాలను అనుసరిస్తూ ఉన్న కొద్దిపాటి నీటిని ఆధునిక పద్ధతులను పాటిస్తూ సమర్థవంతంగా బొప్పాయి సాగు చేస్తున్నాడు. ఆ వివరాలు మీకోసం.

అనంతపురం జిల్లాలో కరవు తాండవిస్తోంది ఖరీఫ్ సాగే కాదు రబీ సాగులోనూ రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంట వేసినట్టే పొలంలోనే ఎండిపోతోంది ఇంతటి కరవులోనూ జిల్లాని కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు మాత్రం సిరుల పంటను పండిస్తున్నాడు అధిక దిగుబడులను పొందుతున్నారు.

శ్రీనివాసులు తనకున్న 7 ఎకరాల పొలంలో 7 వేల బొప్పాయి మొక్కలు నాటాడు. 2 లక్షల రూపాయల పెట్టుబడితో పంటలను సాగు చేస్తున్నాడు. అందరి రైతులాగా రసాయనాల జోలికి వెల్లకుండా ప్రకృతి సేద్యం వపు పయనించాడు అధిక దిగుబడులను పొందుతున్నాడు.

తన 7 ఎకరాల బొప్పాయి తోటకు ఎరువుగా వేస్టు డీకంపోజర్‌ ను వినియోగిస్తున్నాడు. ఎలాంటి రసారయాన, క్రిమి సంహార మందులు పంట వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడలేదు. పొలంలో డ్రిప్ సిస్టమ్ ను ఏర్పరుచుకుని దాని ద్వారానే మొక్కలకు ఎరువును పారిస్తున్నాడు. సాగు నీటిని డ్రిప్ ద్వారానే అందిస్తున్నాడు.

గతంలో రసాయనాల సేద్యంలో రైతు నష్టాలను చవి చూసాడు. దీంతో ప్రకృతి సేద్యాన్ని నమ్ముకున్నాడు. అనుకున్న దానికంటే అధిక దిగుబడిని పొందుతున్నాడు. పంట వేసినప్పటి నుంచి మొక్కలకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని ఎంతలేదన్నా 40 నుంచి 50 టన్నుల వరకు పంట దిగుబడిని ఇస్తుందంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రైతు శ్రీనివాసులతో పాటు మరో కొంత మంది రైతులు ప్రకృతి సేద్యాన్ని చేస్తూ సత‌్ఫలితాలను సాధిస్తున్నారు. ప్రకృతి సేద్యాన్ని నమ్ముకుంటే రైతుకు ఎదురుండదని నిరూపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories