ఉన్నది 75 సెంట్ల భూమి...అయినా బంగారు పంటలు పండుతున్నాయి

Farmer Rosaiah
x
Farmer Rosaiah
Highlights

వయస్సు 73 సంవత్సరాలు అయినా ఒక్కసారి పొలంలో అడుగుపెట్టాడంటే చాలు బంగారు పంటలు పండడం ఖాయం మూడు పదుల వయస్సులోనే ముప్పై రకాల జబ్బులతో బాధపడుతున్నవారు ఇతన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటారు.

వయస్సు 73 సంవత్సరాలు అయినా ఒక్కసారి పొలంలో అడుగుపెట్టాడంటే చాలు బంగారు పంటలు పండడం ఖాయం మూడు పదుల వయస్సులోనే ముప్పై రకాల జబ్బులతో బాధపడుతున్నవారు ఇతన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటారు. చిన్నప్పటి నుంచి చేస్తుంది వ్యవసాయమే తన వారసత్వంగా మిగిలింది మాత్రం ఎకరం పొలం మాత్రమే అందులోనూ కొంత అమ్ముకోవాల్సి వచ్చింది. చివరగా మిగిలింది 75 సెంట్ల వ్యవసాయ భూమి. అదే ఇప్పుడు ఆ రైతుకు ఆర్ధక భరోసాను కల్పిస్తోంది. కొద్ది పాటి స్థలాన్నే వినియోగించుకుని సిరులు పండిస్తున్నాడు ఆ రైతు మరి ఈ రైతు పండిస్తున్న ఆ తోట వివరాలు తెలుసుకుందాం ఇవాళ్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమంలో.

గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య వీరిది వ్యవసాయ కుటుంబం గతంలో ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు సాగును వీడి ఎన్నో వ్యాపారాలు చేశారు. అందులో పైసా ముట్టలేదు చేసేదేమీ లేక మళ్లీ సాగు వైపు అడుగులు వేశారు ఈ క్రమంలోనే 2008 లో సుభాష్ పాలేకర్ ప్రకృత వ్యవసాయ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. మెళ్లి మెళ్లిగా ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడ్డారు ఉద్యానవన పంటలైన పండ్ల సాగును ప్రయోగాత్మకంగా చేపట్టాడు ఉన్నది 75 సెంట్లో కానీ అందులో ఎన్నో రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు.

75 సెంట్లలో ప్రధానంగా 75 కొబ్బరి 75 నిమ్మ చెట్లను పండిస్తున్నారు. అందులోనే జామ, ఉసిరి, సపోట, అరటి, నేరేడు, నారింజ, దానిమ్మ, పైనాపిల్, సీతాఫలం వంటి చెట్లను సాగు చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న ఈయన ఆవు మూత్రం , పేడను ఉపయోగించి తయారు చేసిన ఎరువును మాత్రమే చెట్లకు అందిస్తున్నారు. రోశయ్య సాగు పద్ధతులను తెలుసుకున్న వ్యవసాయ అధికారులు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించి ఈయన చేస్తున్న కృషికి కాస్త ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.

ఏ పని చేసిన అందులో రోశయ్యదే ముఖ్య పాత్ర ఎందుకంటే కూలీల అవసరం లేకుండా ఒంటి చేత్తో సాగు బండిని లాగుతున్నారు. పంట ఉత్పత్తులను సైతం తానే స్వయంగా కోసి అమ్ముతున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఉన్న పొలంతో పాటు ఎకరం పొలాన్ని కౌలుకు తీసుకుని దేశవాళీ వరి రకాలను పండిస్తున్నారు ఈ రైతు. వీటిని విత్తనాల కోసం సాగు చేస్తున్నారు.

పండ్ల చెట్ల ఫలదీకరణ కోసం పరపరాగసంపర్కం కోసం పొలంలోనే తేనె టీగలను పెంచుతున్నారు. తేనె టీగల పెంపకంలో వీరికి 20 పంవత్సరాల అనుభవం ఉంది. ఎంతో నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తేనెను సైతం అమ్మి 20 వేల రూపాయల అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

రసాయన ఎరువుల అవసరం లేకుండా సాగును ఎంత సాఫీగా చేయవచ్చే అందరికీ ప్రత్యక్ష్యంగా చూపిస్తున్నారు ఈ రైతు. తనకున్న 73 సెంట్ల భూమి నుంచి లక్షా 25 వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు..తన జీవనోపాధికి ఇది సరిపోతుందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు

రైతు రోశయ్య ఎంతో మందికి ఆదర్శం అనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా అందులో ఆయన బంగారాన్ని పండిస్తున్నారు. అదే విధంగా తోటి రైతులు సైతం రసాయనాల సాగును వీడి ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని పిలుపును ఇస్తున్నారు ఈ రైతు. తద్వారా రైతుకు అధిక పెట్టుబడులు తగ్గి నికర ఆదాయం లభించే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories