గోదావరి జిల్లాల్లో జపాన్ మ్యాంగో.. సాగుచేస్తే కోటీశ్వరులే..!

Farmer Nageswara Rao Cultivating Miyazaki Mangoes in Kakinada
x

గోదావరి జిల్లాల్లో జపాన్ మ్యాంగో.. సాగుచేస్తే కోటీశ్వరులే..!

Highlights

Miyazaki Mangoes: గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపకు ఓ ప్రత్యేకత ఉంది. నదీ సంగమంలో మాత్రమే దొరికే ఈ చేపను ఎంత ధరైనా పెట్టి కొనే జనం ఇక్కడ మాత్రమే కనిపిస్తారు.

Miyazaki Mangoes: గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపకు ఓ ప్రత్యేకత ఉంది. నదీ సంగమంలో మాత్రమే దొరికే ఈ చేపను ఎంత ధరైనా పెట్టి కొనే జనం ఇక్కడ మాత్రమే కనిపిస్తారు.తింటే పుస్తెలు అమ్మైనా పులస తినాలన్నసామెత కూడా అక్కడ తరచూ వినిపిస్తుంటుంది. అయితే ఇదే దారిలో ఇప్పుడు రికార్డు స్ధాయిలో మామిడి పండ్లూ అమ్ముడవుతున్నాయి. అయితే పులస చేపలా ఇవి సామాన్యుడికి మాత్రం అందుబాటులో లేవు. కేవలం వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు పండిస్తూ కాకినాడ రైతు సాగులో అదరగొడుతున్నారు. మరి ఆ మామిడి ప్రత్యేకత ఏమిటో, దానికి అంత ధర పలకడానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ఓసారి కాకినాడ జిల్లాకు వెళ్లాల్సిందే.

బంగినపల్లి, పెద్దరసాలు, చిన్న రసాల నుంచి అల్ఫాన్సో వరకు ఇలా మామిడి పండ్లలో చాలా రకాల రుచిని చూసి ఉంటాం. రుచిలో ఏ పండు ప్రత్యేకత ఆ పండుదే. అందుకే ధరలలో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అయితే కింగ్ ఆఫ్ మ్యాంగోగా చెప్పుకునే మియాజాకీ మామిడి పండ్ల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో 2 లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు దీని ధర పలుకుతోంది. ఇలాంటి అత్యంత ఖరీదైన మామిడి రకాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందని రైతు ఓదూరి నాగేశ్వరరావు పండిస్తున్నారు. ఔరా అని అనిపిస్తున్నారు.

ఓదూరి నాగేశ్వరరావు తనకున్న నాలుగు ఎకరాల పొలంలో వందకు పైగా పండ్ల రకాలను పెంచుతున్నారు. అరటి పండులా తొక్క వలుచుకుని తినే బనానా మామిడి, యాపిల్ లా కనిపించే యాపిల్ మామిడి, నీలి రంగులో ఉండే బ్లూ మామిడి, టెంక లేని మామిడి, 365 రోజులు కాపు కాసే మామిడి రకాలతో పాటు కేజీ సీతాఫలం, అరటి సపోట, తెల్ల నేరేడు, ఎర్ర పనస, స్ట్రాబెర్రీ జామ, పీనట్ బటర్ ఫ్రూట్ ఇలా వివిధ రకాల అరుదైన పండ్ల మొక్కలు ఈ వ్యవసాయ క్షేత్రంలో కనువిందు చేస్తాయి. వీటితో పాటే కొబ్బరి, రేగు, జామ, సీతాఫలం, నేరేడు, సపోటా పండ్లను, కూరగాయలను మసాలా దినుసులను సాగు చేస్తున్నారు. నాగేశ్వర రావు కూమరుడు కిషోర్ ఆన్‌లైన ద్వారా అరుదైన మొక్కలను తెప్పించి పొలంలో నాటుతున్నాడు. సాగు పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూ సహాయపడుతున్నాడు.

మియాజాకీ రకానికి చెందిన మామిడి పండు ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా, కింగ్ ఆఫ్ మ్యాంగోగా గుర్తింపు పొందింది. జపాన్‌ దేశంలోని మియాజాకీ ప్రాంతంలో ఈ పండు మూలం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బయటకు సువాసనలు వెదజల్లుతూ, లోపల బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆకసిడెంట్స్ ఉండటం, క్యాన్సర్‌ను నిరోధించడం, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కలిగి ఉండటం తో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటంతో అత్యంత ఖరీదు పలుకుతోంది. మియాజాకి మామిడి కి చెందని 20 మొక్కలను తన పొలంలో నాటారు ఈ సాగుదారు.

పండ్ల సాగులో పూర్తి సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నారు నాగేశ్వరరావు. పండ్లతో వ్యాపారం చేయాలనే ఆలోచన లేకపోయినప్పటికీ ఆదాయం ఎక్కువగా వచ్చే రకాలు ఉండటంతో చాలా మంది ఆన్‌లైన్‌లో మమ్మల్ని మొక్కల కోసం సంప్రదిస్తున్నారని, చక్కటి ఫలాలను ఇస్తున్న మొక్కలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెబుతున్నారు. దేశ విదేశాలకు చెందిన అరుదైన పండ్ల మొక్కలను సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు నాగేశ్వరరావు. ఈ సాగుదారు సేద్యంలో మరిన్ని అద్భుతాలను సాధించాలని మనమూ ఆశిద్దాం.


Show Full Article
Print Article
Next Story
More Stories