ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమే మన ద్యేయం : లావణ్య రెడ్డి

ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమే మన ద్యేయం : లావణ్య రెడ్డి
x
Highlights

మన దేశం దేశీయజాతి పశువులెన్నింటికో పుట్టినిల్లు, ఇవి మనకు తరతరాలనుండి సంక్రమించిన జన్యుసంపద. స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ, ఎక్కువ వ్యాధి నిరోధక...

మన దేశం దేశీయజాతి పశువులెన్నింటికో పుట్టినిల్లు, ఇవి మనకు తరతరాలనుండి సంక్రమించిన జన్యుసంపద. స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ, ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండి, తక్కువ ఖర్చుతో పోషించగలిగే, దేశీయ జాతి ఆవులు సేంద్రియు వ్యవసాయానికి వెన్నుముకలాంటివి. అందువల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యం మనందరిపై ఉంది. ఆ దిశగానే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన లావణ్యారెడ్డి. దేశీయ గో సంతతిని సంరక్షిస్తూ ప్రకృతి సేద్యాన్ని చేస్తూ ఆదర్శంగ నిలుస్తున్నారు లావణ్య రెడ్డి

మార్కెట్‌లో విక్రయించే ఆహారపదార్ధాల్లో రుచి లేదు, నాణ్యత లేదు తాగే పాలు సైతం కలుషితమైపోయాయి. ఈ నేపథ్యంలో దేశీయ గోవులతో డైయిరీని నిర్వహించాలనుకున్నారు లావణ్య రెడ్డి. ఆంధోల్‌లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందులో కొంత భాగంలో గో సంతతిని సంరక్షించడంతో పాటు మిగతా 15 ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేస్తున్నారు. డబ్బు సంపాదన తమ లక్ష్యం కాదని అంతరించిపోతున్న మన దేశీయ జాతి గోవులను సంరక్షించడం. అలాగే నాణ్యమైన పంట ఉత్పత్తులను సృష్టించడమే తమ ఉద్దేశమంటున్నారు.

ప్రస్తుతం తన ఫార్మ్‌లో 200 గిర్ ఆవులు ఉన్నాయి వీటిని ప్రత్యేకమైన షెడ్డులను నిర్మించి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. పశు పోషణలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. నాణ్యమైన దాణాను అందిస్తున్నారు.

మొదట నాణ్యమైన పాలను విక్రయించాలనే ఉద్దేశంతో డెయిరీని ఏర్పాటుచేసారు ఆ తరువాత దేశవాళీ గోవుల నుంచి వచ్చే వ్యర్థలతో రైతుకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. దీంతో దేశవాళీ గోవు నెయ్యి, పాలు, పెరుగు, మూత్రం, పేడ, చెరకు రసం, కొబ్బరి నీరు, తాటికళ్లు,అరటిపండ్లు కలిపి పోషకాలతో కూడాని సహజ ఎరువును తయారు చేశారు. ఈ ఎరువును సొంతంగా తమ పొలంలోని పంటలకు అందించారు ఇది పంటకు ఎంతో బలాన్ని అందించిందని నాణ్యమైన, రుచికరమైన దిగుబడిని పొందామని లావణ్య రెడ్డి చెబుతున్నారు. ఈ ఎరువును ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు.

మన దేశీయ నాటు ఆవులు అంతరించిపోతున్నాయి వాటిని కాపాడుకోవాలనేది ఈమె ఉద్దేశం. ఇప్పటికీ చాలా మందికి దేశీయ గో సంపదపైన అవగాహన లేదు అందుకే రైతులకు, రానున్న తరానికి దేశీ ఆవు అంటే ఏమిటి, వాటి యొక్క ప్రయోజనాలేంటో తెలిపేందుకు డెయిరీ రంగంలో అపార అనుభం ఉన్న ఈ లావణ్య రెడ్డి ఆర్గానిక్ రిసార్ట్స్ ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తున్నారు. పక్కా ప్రణాళికతలో ముందుకు వెళ్తున్నారు. సహజ సిద్ధంగా పండించిన పంటలను స్వయంగా విక్రయించేందు చెరక బ్రాండ్‌తో మార్కెట్‌లోకి రానుండడం విశేషం. మిగతా రైతులు కూడా రసాయనాలకు దూరంగా సహజ సిద్ధ వ్యవసాయాన్ని చేస్తూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడాలని పిలుపునిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories