ఎడతెరిపి లేని వానలతో ఆందోళనలో రైతులు

ఎడతెరిపి లేని వానలతో ఆందోళనలో రైతులు
x
Highlights

ప్రకృతి విపత్తులు రైతులపై మరోసారి పగపట్టాయి. నేల్లూరు జిల్లా వరి రైతులపై అకాల వర్షాలు విరుచుకు పడుతున్నాయి. అల్పపీడనాలు.. విపత్తులు...

ప్రకృతి విపత్తులు రైతులపై మరోసారి పగపట్టాయి. నేల్లూరు జిల్లా వరి రైతులపై అకాల వర్షాలు విరుచుకు పడుతున్నాయి. అల్పపీడనాలు.. విపత్తులు రైతులను కుదేలు చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో నీటిపాలౌతోంది. అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు కర్షకులకు కన్నీళ్లు వస్తున్నాయి. రైతుల దుస్థితి పై ప్రత్యక కథనం.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లా రైతులు గతంలో ఎప్పుడూ లేనంతగా నష్టాల బారిన పడుతున్నారు. ఎక్కడికక్కడ పంట చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం నేల పాలవుతుంది. అన్నదాతలకు ఆవేదనే మిగులుతోంది. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది సోమశిల పరిధిలోని డెల్టా రెండో పంటగా దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. అప్పట్లో వాతావరణం అనుకూలించింది. పెరిగిన పెట్టుబడులు సైతం లెక్కచేయక రైతులు పూర్తిస్థాయిలో పంటలు సాగు చేశారు ఇక్కడి రైతులు. తమ కష్టం తీరుతుందని భావించిన రైతులకు పంట కోత కోసే సమయంలో ఒక్కసారిగా అల్పపీడనాలు, అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచేశాయి. ఒక ఎకరానికి కనీసం రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ఎకరాకు మూడు పుట్ల దిగుబడి వస్తే లాభాలు లేకపోయినా కనీసం తమ కష్టానికి ఫలితం ఉంటుందని భావించారు నెల్లూరు అన్నదాతలు. అయితే వర్షాలు వారి ఆశలపై నీళ్ళు చల్లాయి. ఎక్కడికక్కడ పంట నేలపాలయింది. కష్టాలకోర్చి యంత్రాల ద్వారా కోతలు చేపట్టిన రైతులకు గింజ బయటకు రాకముందే కురిసిన వర్షాలు ధాన్యాన్ని తడిసి ముద్ద చేస్తున్నాయి.

అకాల విపత్తులతో నెల్లూరు వరి రైతులు ఆందోళన చెందుతుంటే ఇదే అదునుగా భావించిన మిల్లర్లు, ధాన్యం కొనుగోలు దారులు, దళారులు ధరలు దిగజార్చి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 840 కిలోల పుట్టి ధాన్యం ప్రభుత్వం ప్రకటించిన ప్రకారమే వివిధ రకాల మద్దతు ధర రూ.14 నుంచి రూ.16 వేల వరకు ఉంది. అయితే వర్షాలు బూచిగా చూపి తేమ శాతం ఎక్కువగా ఉందని దాన్యం దళారులు పుట్టి ధాన్యాన్ని రూ. 9 నుంచి రూ 10 వేల వరకు ధరలు దిగజార్చి దారుణంగా దోచుకుంటున్నారు. ఇలా జిల్లాలో సుమారు 9 లక్షల పుట్ల ధాన్యం దిగుబడి లో కనీసం 5 లక్షల పుట్ల ధాన్యాన్ని ఇలా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కొ పుట్టికి కనీసం 5 నుంచి 6,000 ప్రకారం రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో ఐదు లక్షల పుట్ల పై సుమారు రూ. 250 కోట్లకు పైగా కర్షకుల కష్టాన్ని దోచేస్తున్నారు. వర్షాన్ని కారణంగా చూపి మిల్లర్లు దళారులు తమ జేబులు నింపుకుంటున్నారు.

నెల్లూరు జిల్లాలో అకాలంగా కురుస్తున్న వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తాము కొనుగోలు కేంద్రాలకు తీసుకురండి ధరలు దిగజార్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నుంచి మంత్రుల వరకు పదేపదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వాటిని కొనుగోలుదారులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. పండించిన ధాన్యం నిల్వచేసుకుని మార్గంలేని రైతుల అచేతనాన్ని ఆసరాగా తీసుకుని నిలువునా దోచుకుంటున్నారు. సాగు చేసేటపపుడు పెట్టుబడులు గిట్టుబాటు ధర లేక మరోవైపు అన్నదాతలు నట్టేట మునిగిన పోతున్నారు. జిల్లా అధికారుల ఆదేశాలు రాష్ట్ర పాలకుల సూచనల ప్రకారం ఇప్పటికైనా ఇటు మార్కెటింగు అలాగే పౌరసరఫరాల సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాల నాయకులు, కర్షకులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories