గో-ఆధారిత సేద్యంలో రాణిస్తున్న ఏలూరు జిల్లా రైతు

Eluru Farmer Excels in Go Adharitha Vyavasayam
x

గో-ఆధారిత సేద్యంలో రాణిస్తున్న ఏలూరు జిల్లా రైతు

Highlights

గో-ఆధారిత సేద్యంలో రాణిస్తున్న ఏలూరు జిల్లా రైతు

Go Adharitha Vyavasayam: ఏలూరు జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు వినూత్న ఆలోచనలతో సేద్యంలో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. తన సాగు క్షేత్రాన్ని సుస్థిర వ్యవసాయానికి నిలువెత్తు నిదర్శనంగా మార్చారు ఈ సాగుదారు. 40 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి, పామాయిల్, అరటి తోటలను రసాయన రహితంగా పూర్తిగా గో ఆధారంగా సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం కూలీలకు తప్ప ఇతర సాగు ఖర్చులు లేకుండా సేద్యాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం అంటే జూదంగా మారిపోతున్న తరుణంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తూ ఔరా అనిపిస్తు్న్నారు. అంతేకాదు అంతర పంటలతో, పాటు డైరీ నిర్వహణతో అదనపు ఆదాయం పొందుతున్నారు ఈ రైతు.

మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రంలో 20 ఎకరాల్లో కొబ్బరి, 15 ఎకరాల్లో ఆయిల్ ఫామ్, మరో 5 ఎకరాలలో అంతర పంటగా అరటి సాగులో ఉన్నాయి. వీటితోపాటు అనుబంధంగా డైరీని నిర్వహిస్తున్న ఈ రైతు పేరే నందిగాం సీతారాం తిలక్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కలరాయి గూడెం గ్రామానికి చెందిన ఈ రైతు గతంలో రసాయన ఎరువులతో సాగు చేసేవారు. అయితే పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాకపోవడం, సాగులో గిట్టుబాటు లేకపోవడంతో, ఏడాది కాలం నుండి ప్రకృతి విధానంలో పంటలు పండించడం మొదలు పెట్టారు ఈ సాగుదారు. పూర్తి గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు సీతారామ్ తిలక్‌.

దశబ్దకాలంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. అధిక దిగుబడి ఇచ్చే వంగడాల మాయలో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారం అవ్వడం, చీడ పీడల ఉధృతి పెరగటం వల్ల దిగుబడును తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరిగిన పెట్టుబడి మరో వైపు కూలీల కొరతకు తోడు సాగు భారం రైతును వెన్నాడుతుంది. ఈ పరిస్థితులను అనుభవం ద్వారా తెలుసుకున్న రైతు సీతారాం తిలక్ ఏడాదిగా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. అంతే కాదు 30 గేదెలు, అవులతో కలిపి డైరీ ఫామ్‌ను నిర్వహిస్తున్నారు. డైరీ నుండి వచ్చిన వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ ఎలాంటి పెట్టుబడి లేకుండా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు.

ప్రస్తుతం ఈ రైతు దగ్గర 15 ఒంగోలు ఆవులు, 15 గేదలు ఉన్నాయి. వీటిని తోటలోనే షెడ్డు వేసి సురక్షిత విధానంలో పెంచుతున్నారు. ఆవులు, గేదెలు తోటలో పెరిగిన గడ్డిని మేస్తూ, వాటి విసర్జాలను పొలంలో వదులుతాయి. సాయంత్రానికి షెడ్డుడ్ లోకి చేరుతాయి. దీని వలన గడ్డి కొనుగోలు ఖర్చు కొంత ఆదా అవ్వడంతో పాటు మొక్కలకు ప్రకృతి ఎరువులు అంది నాణ్యమైన దిగుబడి చేతికి అందుతోందని రైతు చెబుతున్నారు. సీతారాం తిలక్ స్ఫూర్తితో తోటి రైతులు గో ఆధారిత సేద్యానికి మక్కువ చూపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories