డ్రాగన్ ఫ్రూట్ సాగు.. సరికొత్త టెక్నాలజీతో అధిక దిగుబడులు

డ్రాగన్ ఫ్రూట్ సాగు.. సరికొత్త టెక్నాలజీతో అధిక దిగుబడులు
x
Highlights

డ్రాగన్ ఫ్రూట్ ఉద్యానపంటల సాగులో వైవిధ్యమైనది ఆకారంలోనూ, పోషకాల్లోనూ అంతే ! ఇక్కడి వాతావరణానికి ఏమాత్రం సరితూగని డ్రాగోన్ ఫ్రూట్ సాగును విజయవంతంగా 4...

డ్రాగన్ ఫ్రూట్ ఉద్యానపంటల సాగులో వైవిధ్యమైనది ఆకారంలోనూ, పోషకాల్లోనూ అంతే ! ఇక్కడి వాతావరణానికి ఏమాత్రం సరితూగని డ్రాగోన్ ఫ్రూట్ సాగును విజయవంతంగా 4 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు ఆ యువ రైతు. సరికొత్త పద్ధతిలో ఒక సీజన్ కి మాత్రమే పరిమితమైన ఈ పంట సాగును రాత్రీల్లు కూడా సాగు చేస్తూ సంవత్సరమంతా దిగుబడులు సాధిస్తున్నాడు సంగారెడ్డి జిల్లాకి చెందిన యువ రైతు, డాక్టర్ శ్రీనివాస్ రావు !! ఆఫ్ సీజన్లో కూడా సహజ సేంద్రియ పద్ధతిలో దిగుబడులను పొందే వినూత్న డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ప్రత్యేక కథనం.

సంగారెడ్డి జిల్లా, అలియాబాద్ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాడు యువ రైతు శ్రీనివాస్ రావు, వృత్తి రీత్యా డాక్టర్. వైవిధ్యమైన డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఆకర్షితుడై గత నాలుగేళ్ళగా సాగు చేస్తున్నాడు. మన ప్రాంతాల్లో అరుదుగా సాగు చేసే ఈ డ్రాగన్ ఫ్రూట్ ని ఒక సీజన్ కి మాత్రమే పరిమితం చెయ్యకుండా, ప్రయోగాత్మకంగా రాత్రి సమయాల్లో కూడా సాగు చేస్తూ ఏడాది ఆసాంతం దిగుబడులు పొందుతున్నాడు ! అసలు రాత్రి సమయాల్లో సాగు చేయడమేంటి !? అది ఎలా సాధ్యపడుతుంది ? ఆ యువ రైతు మాటల్లోనే తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో ఎంతో మందిని ఆక్షర్శిస్తున్న పండు ఇది. పోషకాల్లో కూడా ఇది డ్రాగనే. కానీ కాస్త పెట్టుబడులతో కూడుకున్న సాగు. కాకపోతే కాస్త శ్రమిస్తే పెట్టుబడులను మించి లాభాలుంటాయని అంటున్నాడు ఈ రైతు. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ? మన వాతావరణానికి సరిపోయే రకాలు ఏవి ? సాగు విధానంతో పాటు పంట కాలం వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories