సాగు బండిని లాభాల బాటలో నడిపే ఉద్యానవన పంటలు

సాగు బండిని లాభాల బాటలో నడిపే ఉద్యానవన పంటలు
x
సాగు బండిని లాభాల బాటలో నడిపే ఉద్యానవన పంటలు
Highlights

సాగులో వాణిజ్య పంటలే కాకుండా రైతులకు లాభదాయకంగా ఉండే పండ్ల తోటల సాగు పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో సేద్యానికి తగ్గ ఆదాయం పొందే ప్రకృతి వ్యవసాయం...

సాగులో వాణిజ్య పంటలే కాకుండా రైతులకు లాభదాయకంగా ఉండే పండ్ల తోటల సాగు పెరుగుతుంది. తక్కువ పెట్టుబడితో సేద్యానికి తగ్గ ఆదాయం పొందే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటల వీడి తక్కువ శ్రమ, ఎక్కువ లాభదాయకమైన ఉద్యానవన తోటల సాగు పై ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో రైతులకు మేలు చేకూరే విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో లాభాలు తెచ్చిపెట్టే వివిధ పండ్ల తోటల పెంపకం పై ప్రత్యేక కథనం.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం అలియాబాద్‌ గ్రామనికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ రావు 11 ఎకరాలలో డ్రాగన్ పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. మొదట తన పెళ్లిలో చూసిన ఆకర్షణీయమైన ఈ డ్రాగన్ ఫ్రూట్ ను ఎప్పటికైనా సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానితో దేశ విదేశాలు తిరిగి దీని గురించి తెలుసుకొని సాగు చేయటం మొదలు పెట్టారు.

పళ్లలో పేదవాడి ఆపిల్ గా జామపండుకు ఒక విశిష్టత ఉంది. అధిక పోషకాలు కలిగిన జామపండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. దేశి జాతుల రకాలతో పాటు ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో పోషక విలువలు అధికంగా ఉండే తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ సేద్యం పరంగా చూసుకున్నా జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. ఆ విధంగానే 15 సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తూ పత్తిని సాగు చేసి నష్టాలను ఎదుర్కొని, గత రెండేళ్లుగా ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్నాడు వికారాబాద్ జిల్లా, రోంపల్లి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రాజు

ప్రకృతి వ్యసాయ ముఖ్య లక్ష్యం పండించే రైతుకు నష్టాలు లేని దిగుబడి, అటు నేలతల్లికి, ఇటు రైతు బిడ్డకి, క్షేమదాయకం ఈ ప్రకృతి సాగు, ఆ విధానంలోనే గుంటూరు జిల్లా, దావులూరు గ్రామానికి చెందిన రైతు వీరస్వామి ఎకరంనర పొలంలో సమగ్ర సాగు విధానంలో నిమ్మతోటతో పాటు తైవాన్ జామను సాగు చేస్తున్నాడు.

కర్నూల్ జిల్లా సీతారామపురం గ్రామానికి చెందిన యుగేందర్ రెడ్డి, చిన్నతనం నుండి వ్యవసాయ కుటుంబంలో పెరిగాడు. పంట మార్పిడిలు తరచుగా చెయ్యడం వల్ల ఇబ్బందులు కలగడంతో ఎక్కువ రోజులు సాగు చేసే పండ్లతోటల మీద దృష్టిపెట్టాడు. అందులో భాగంగా లాభదాయకంగా ఉండే దానిమ్మతోటను ప్రకృతి విధానంలో సాగు చేయడం ప్రారంభించాడు. పండ్లతోటలకి ప్రకృతి సాగు అచ్చిరాదని తోటి రైతులు నిరుత్సాహపరచినా ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు వెళ్లి, ఆర్గానిక్ సేద్యం పై పూర్తి శిక్షణ తీసుకున్నాడు. ఆ విధానంలోనే దానిమ్మను సాగు చేస్తున్నాడు.

పోషకాలు మెండుగా ఉండి అన్ని సీజన్లలో సాగుకు అనుకూలించే అరటి తోట ఆశాజనకంగా ఉంటుంది. ఆ విధంగానే గుంటూరు జిల్లా, కొల్లిపార గ్రామానికి చెందిన యువ రైతు ఫణింద్ర రెడ్డి, అభ్యుదయ రైతు బాపారావు స్ఫూర్తితో 5 సంవత్సరాలుగా ప్రకృతి సేద్యం చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories