ఖండాంతరాలు దాటి వెళ్లినా కన్న నేల మీద ప్రేమ చావలేదు

ఖండాంతరాలు దాటి వెళ్లినా కన్న నేల మీద ప్రేమ చావలేదు
x
Highlights

ఖండాంతరాలు దాటి వెళ్లినా కన్న నేల మీద ప్రేమ చావలేదు విదేశాల్లో ఉద్యోగం, మంచి ఆదాయం వస్తున్నా సంతోషం, తృప్తి దక్కలేదు నిత్యం ఏదో ఒక వెలతి అతన్ని...

ఖండాంతరాలు దాటి వెళ్లినా కన్న నేల మీద ప్రేమ చావలేదు విదేశాల్లో ఉద్యోగం, మంచి ఆదాయం వస్తున్నా సంతోషం, తృప్తి దక్కలేదు నిత్యం ఏదో ఒక వెలతి అతన్ని వేధిస్తుండేది అందుకు పరిష్కారమార్గాన్ని అతనే కనుక్కున్నాడు మన సంస్కృతిని కాపాడాలనే ధృడసంకల్పంతో గోవుల సంరక్షణను చేపట్టాడు. విజయపథంలో దూసుకెళుతున్నాడు. నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు ఉజ్వల్‌పై ప్రత్యేక కథనం.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఉజ్వల్‌ ఉన్నత చదువులు చదువుకున్నాడు. హైదరబాద్ లో డిజేగా కెరీర్‌ని మొదలు పెట్టాడు. ఆ తరువాత మంచి అవకాశం రావడంతో ఆడియో ఇంజనీర్‌గా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వుంటూ పని చేస్తున్నాడు. మంచి స్థాయిలో ఉన్నా లక్షల్లో ఆదాయం సంపాధిస్తున్నా ఇవేమీ ఉజ్వల్‌కు ఆనందాన్ని అందించలేకపోయాయి. దీంతో మన దేశీ ఆవు ప్రాముఖ్యత తెలుసుకొని మొదట ఒక ఆవుతో మొదలు పెట్టి ఇప్పుడు 50 వరకు దేశీ ఆవులతో గోశాలను నిర్వహిస్తున్నాడు. భవిష్యత్తులో రైతుగానే తన జీవితాన్ని గడపాలనే ధృడ సంకల్పంతో ముందుగు సాగుతున్నారు. సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

మెదక్ జిల్లా, తూప్రాన్ మండలం, గుండురెడ్డి పల్లి గ్రామంలోని 6 ఎకరాల విస్తీర్ణంలో ఎకరంన్నర లో గోవులను పెంచుతున్నారు. మిగిలిన 4 ఎకరాల్లో గోవులకు అవసరమైన దాణా కోసం గడ్డి, మొక్కజొన్న పంటలతో పాటు పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ సీసీ టీవీ కెమెరాల ద్వారా నిత్యం గోశాలను పంటలను పర్యవేక్షిస్తుంటారు. వ్యాపార దృక్పదంతో కాకుండా నలుగురికి ఆరోగ్యకరమైన పాలను అందించాలన్నదే తన ఉద్దేశమంటున్నారు ఉజ్వల్‌.

గోవు నుంచి ఎన్నో ఉత్పత్తులు తయారవుతున్నాయి. గో ఆధారంగా పాలు, పెరుగు, నెయ్యే కాకుండా 20 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అవన్ని కాకపోయిన గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో ఘనజీవామృతం, ద్రవజీవామృతాన్ని తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నాడు. తనతో పాటు తోటి రైతులకు వీటిని అందిస్తున్నారు. అంతేకాదు గ్రామంలోని నలుగురు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను దత్తత తీసుకుని వారికి గోవులను ఇచ్చి వాటి సంరక్షణ బాధ్యతలను అప్పగించారు. వారు గోఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు.

ఆస్ట్రేలియాలోనూ ఇంట్లోకి అవసరమయ్యే కూరగాయలను, ఆకుకూరలను, పండ్లను వీరే స్వయంగా పండించుకుంటున్నారు. ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా స్థానికంగా ఉన్న సూపర్‌మార్కెట్‌లలో లభించే కంపోస్టును సేకరించి వాటిని పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు. మనసా, వాచా, కర్మనా ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుందంటున్నాడు ఉజ్వల్. గోవులకు సేవ చేయడం వల్ల ఆత్మ సంతృప్తి లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు సారం కోల్పోతున్న నేలలకు గోవుల ద్వారా జీవం పోయవచ్చంటున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories