గిరిజన మహిళల ఆదర్శం.. ఇక్రిసాట్ తోడ్పాటుతో దేశీ నాటుకోళ్ల పెంపకం

గిరిజన మహిళల ఆదర్శం.. ఇక్రిసాట్ తోడ్పాటుతో  దేశీ నాటుకోళ్ల పెంపకం
x
Highlights

దేశీ కోళ్ల పెంపకం ఆ గిరిజన మహిళలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఉపాది లేని గిరిజన మహిళలకు ఆ కోళ్ల పెంపకమే బ్రతుకు బాటను చూపిస్తోంది. మార్కెట్ లో దేశీ...

దేశీ కోళ్ల పెంపకం ఆ గిరిజన మహిళలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఉపాది లేని గిరిజన మహిళలకు ఆ కోళ్ల పెంపకమే బ్రతుకు బాటను చూపిస్తోంది. మార్కెట్ లో దేశీ కోళ్లకు మంచి డిమాండ్ ఉండడంతో కోళ్ల పెంపకంలో లాభాలను గడిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన మహిళలు సమష్టి కృషితో కోళ్ల పెంపకంలో ఆదర్శంగా నిలుస్తున్న గిరిజన మహిళలపై ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌ మండలం మాన్కపూర్ అదివాసీల గ్రామం. గ్రామంలో నివసించే గిరిజన మహిళలు ఇక్రిసాట్ తోడ్పాటు తో దేశికోళ్ల పెంపకం చేపట్టారు. ఆరవై మంది మహిళలు మూడేళ్ల క్రిందట దేశికోళ్ల పెంపకం చేపట్టారు. కోళ్ల పెంపకానికి అయ్యే పెట్టుబడిని సైతం వారే పోదుపు సంఘం ద్వారా సమాకూర్చుకున్నారు. పెట్టుబడితొనే గిరిజన మహిళలు కోళ్లను పెంచుతున్నారు.

మొదట్లో అరవై మంది మహిళలు ఐదుకోళ్లతో ‌పెంపకం చేపట్టారు మూడు సంవత్సరాల తర్వాత ఒక్కోక్కరు పెద్దస్థాయిలో కోళ్లను పెంచుతున్నారు. ప్రధానంగా వనరాజ, గిరిజన , గ్రంపరియా వంటి దేశీవాళి రకం కోళ్లను పెంచుతున్నారు. పెంపకానికి పెద్దగా పెట్టుబడి వ్యయం లేదంటున్నారు గిరిజన మహిళలు. అయితే గిరిజన మహిళలు పెంచుతున్న కోళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది ‌నాటు కోళ్లు కావడంతో వీటి మాంసం తినడానికి ప్రజలు ఎక్కువగా అసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల నుండి కోళ్లను కోనుగోలు చేయడానికి వస్తున్నారు. అదే విధంగా హైదారాబాద్ లాంటి దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ కోళ్లను కోనుగోలు చేస్తుండటం విశేషం.

దేశీకోడి మాంసం కు డిమాండ్ ఉండటంతో గిరిజన మహిళలకు ‌భారీగా లాభాలను అర్జిస్తున్నారు. పెంచిన ఒక్కో కోడి కనీసం ఆరు కిలోల బరువు ఉంటుంది. కిలోకు ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు లభిస్తోంది. ఆంటే ఒక కోడి ఎంతగా తక్కువగా అంచన వెసినా నాలుగువేల ఆదాయం ఇస్తుందని గిరిజన మహిళలు అంటున్నారు. ఈ విదంగా దేశి కోళ్ల పెంపకంతో ఒక్కోక్కరు నెలకు ఇరవై వేలకు పైగా ఆదాయం పోందుతున్నారు. పైగా పెంచిన కోళ్లను కోనుగోలు చేయడానికి తరలివస్తున్నారు. దాంతో కోళ్లు పెరిగితే చాలు ఇంటిముందుకు వచ్చి కోనుగోలు చేస్తున్నారు. దాంతో మార్కెట్ లేదనే బాధ లేదంటున్నారు మహిళలు.

ఇప్పటికే పెంచిన దేశి కోళ్లను నాలుగు,ఐదుసార్లు అమ్మారు. కోళ్ల పెంపకం లేక ముందే కోందరు పనికోసం కూలికి వెళ్లేవారు. కాని కోళ్ల పెంపకంతో తమకు ఉపాధి లభించడంతోపాటు ఆదాయాన్ని భారీగా ఇస్తుందని గిరిజన మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు‌. పైగా కోళ్లు పెంపకం తో తమ కాళ్ల పై తాము జీవించడం బ్రతుకు భరొసానిస్తుందని అంటున్నారు మహిళలు. అయితే దేశి కోళ్ల పెంపకం కాసుల వర్షం కురిపిస్తుండటంతో భారీస్థాయిలో కోళ్ల పెంపకం చేపట్టాలని గిరిజన మహిళలు భావిస్తున్నారు. అయితే గిరిజన మహిళల కోళ్లపెంపకం కోసం సర్కార్ సహాయం అందించాలని గిరిజన మహిళలు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories