అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారపు పంటల సాగు

Cultivation of Food Crops in Anganwadi Centers
x

అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారపు పంటల సాగు

Highlights

Anganwadi Centers: ఆదిలాబాద్ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో ఆహారపు పంటలు సందడి చేస్తున్నాయి.

Anganwadi Centers: ఆదిలాబాద్ జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో ఆహారపు పంటలు సందడి చేస్తున్నాయి. అంగన్వాడీలో పంటలేంటని ఆశ్చర్యపోగండి, కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే ఆహారం పోషకాలతో కూడుకున్నదై ఉండాలనే ఉద్దేశంతో , ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కేంద్రాల వద్దే పెరటి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు. పంటల సాగు వల్ల కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో పాటు తాజా కూరగాయలు అందివస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పోషకాహారాన్ని అందిస్తున్న న్యూట్రిషన్ గార్డెన్ల పై ప్రత్యేక కథనం

అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రీ కిచెన్ గార్డెన్ ల ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు నాంది పలికారు. జిల్లాలోని ఐదు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండగా వాటి పరిధిలో 1256 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు 32 వేల మందికి పోషకపదార్థాలు అందజేస్తున్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు జిల్లాలోని అన్ని అంగన్వాడిల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటుకు అవసరమైన విత్తన కిట్లను వ్యవసాయశాఖ అధికారులు అందజేశారు.

జిల్లా వ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల్లో పెరటి తోటల పెంపకం ద్వారా తాజా కూరగాయలు సేంద్రియ పద్దతిలో పండించి, లబ్దిదారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఆయా అంగన్వాడి కేంద్రాల ఆవరణలో ఖాళీ స్థలాలు ఉన్న చోట న్యూట్రీ గార్దేన్లు ఏర్పాటు చేశారు. స్థలాలు లేని చోట టెర్రేస్ పైన కుండీలు, బకెట్లలో పెంపకానికి ఏర్పాట్లు చేశారు. పాలకూర, తోటకూర,టమాట, బెండ, కాకర, కరివేపాకు, క్యారెట్, చిక్కుడు వంటి పలు రకాల ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. దీనితో పాటు జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు పెంచుతున్నారు. దీంతో ప్రతి అంగన్వాడి కేంద్రం పచ్చని తోటల నడుమ కలకలలాడుతోంది.

ప్రతి అంగన్వాడి కేంద్రాల వద్ద న్యూట్రీ గర్దేన్లు ఏర్పాటు చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందజేయడానికి కృషి చేస్తున్నమని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మిల్కా తెలిపారు.పెద్దగా ఖర్చు లేకుండా వంటింటి వ్యర్థాలను ఉపయోగించి, ఖాళీ స్థలంలోనే పంటల సాగుకు శ్రీకారం చుట్టమని, న్యూట్రిషన్ గార్దేన్లు సత్ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని కొన్ని అంగన్వాడీ సెంటర్లలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ న్యూట్రిషన్ గార్డెన్లు విజయవంతం అవడంతో గ్రామీణ ప్రాంతాలలోని మిగితా చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories