వానాకాలం సాగుకు కరోనా ఎఫెక్ట్

వానాకాలం సాగుకు కరోనా ఎఫెక్ట్
x
Highlights

కరోనా ఎఫెక్ట్ వానాకాలం సాగుపై పడింది. వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లకు సిద్ధమవుతున్న రైతులకు కూలీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వలస కూలీలు...

కరోనా ఎఫెక్ట్ వానాకాలం సాగుపై పడింది. వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లకు సిద్ధమవుతున్న రైతులకు కూలీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వలస కూలీలు లేక స్థానిక కూలీలకు డిమాండ్ బాగా ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా కూలీ ధరలకు రెక్కలొచ్చాయి. ఏ ఊరి కూలీలు ఆ ఊళ్లోనే పని కల్పించాలని స్థానికంగా చేస్తున్న తీర్మానాలతో అన్నదాతలపై మరింత భారం పడుతోంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కూలీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల కూలీలు వాళ్ల సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో లోకల్ కూలీలకు డిమాండ్ పెరిగింది. వైరస్ తీవ్రత దృష్ట్యా ఏ గ్రామాల్లో ఉన్న కూలీలు ఆ గ్రామాల్లోనే పని చేయాలని స్ధానికంగా తీర్మానాలు చేస్తుండటంతో వ్యవసాయ కూలీలు కూలీ రేట్లను అమాంతం పెంచేశారు. మగవారికి రోజు కూలీ 500 నుంచి 600 వరకు పలుకుతుండగా ఆడవారికి 360 నుంచి 400 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఎకరం వరినాటుకు 4000 నుంచి 4500 రూపాయల వరకు ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు కూలీ రేట్లు పెరగడంతో మహిళా కూలీలు ఉత్సాహాంగా పొలం పనులకు పరుగులు పెడుతున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరినాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోని నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, జుక్కల్ మండలాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వరినాట్లు వేసేందుకు ఇంతకుముందు నిజామాబాద్ కు కూలీలు తరలి వచ్చేవారు. వర్ని కూలీ అడ్డాలో దర్శనం ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్ర వలస కూలీలు వారి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఇతర ప్రాంతాల కూలీలు వచ్చేందుకు భయపడుతున్నారు. దీనికి తోడు కొన్ని గ్రామాల్లో ఏ ఊరి కూలీలు ఆ ఊళ్లో పనులు కల్పించాలని చెబుతుండటం సమస్యకు కారణంగా మారింది. అందరూ రైతులు ఒకేసారి వరినాట్లుకు సిద్దమవుతుండటంతో కూలీల ధరలు పెరిగేలా చేస్తున్నాయి.

మూలిగే నక్కపై తాడికాయ పడ్డ చందంగా మారింది ప్రస్తుతం రైతుల పరిస్ధితి. అసలే ఎరువులు- విత్తనాల ధరల పెంపుతో పెట్టుబడి రెట్టింపు అయ్యిందని ఆందోళనలో ఉన్న రైతులకు పెరిగిన కూలీల ధరలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories