డిగ్రీ చదివి సాగు బాట

డిగ్రీ చదివి సాగు బాట
x
Highlights

ప్రకృతి వ్యవసాయం! నేలతల్లిని కళ్ళకు అద్దుకుని, ప్రకృతి వనరులని గుండెలకు హత్తుకొని, దేశి ఆవులతో మమేకమై సేద్యం చెయ్యడం భారతీయ రైతులకు మాత్రమే తెలిసిన...

ప్రకృతి వ్యవసాయం! నేలతల్లిని కళ్ళకు అద్దుకుని, ప్రకృతి వనరులని గుండెలకు హత్తుకొని, దేశి ఆవులతో మమేకమై సేద్యం చెయ్యడం భారతీయ రైతులకు మాత్రమే తెలిసిన వ్యవసాయం. ఈ క్రమంలో మేలైన దేశీ వరి వంగడాలలో నల్లరకం వరి సాగులో ఆదర్శంగా నిలుస్తుంది పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళా రైతు. ఉన్నత చదువుల చదివి ఉద్యోగ బాట పట్టకుండా నాణ్యమైన ,ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రకృతి సాగు బాట పట్టిన మహిళా రైతు శ్రీ వనిత మైథిలి ప్రకృతి సాగుపై ప్రత్యేక కథనం

పెద్దపల్లి జిల్లా, హరిపురం గ్రామానికి చెందిన శ్రీ వనిత డిగ్రీ చదువు పూర్తి చేసింది. ప్రకృతి వ్యవసాయానికి ఆకర్షితురాలై, సుభాష్ పాలేకర్ స్పూర్తితో తన తల్లిదండ్రులతో కలిసి ప్రకృతి విధానంలో సాగును మొదలు పెట్టింది. ప్రస్తుతం దేశీ విత్తనాలతో అరుదైన నల్ల రకం వరిని సాగు చేస్తోంది. పాత తరం నాటు వరి పంటతో లాభాలను తెలుసుకొని నల్లని వరి పంటను సాగు చేస్తున్నారు. ఈ నల్ల రకానికి చెందిన బియ్యంతో క్యాన్సర్ వంటి వ్యాధులు దరిదాపులకు కూడా రాదని, రసాయనాల జోలికి వెల్లకుండా ఎరువులుగా పశువుల పేడ , మూత్రాన్ని సేకరించి జీవామృతాన్ని తయారు చేసి, పొలంలో చల్లుతామంటోంది శ్రీవనిత.

రసాయనాల వ్యవసాయం వ్యసనంగా మారిన తరుణంలో, ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారం అందించాలన్నా రైతులు ఆర్ధికంగా బలపడాలన్నా ఒకే ఒక్క మార్గం, ప్రకృతి వ్యవసాయం. సహజ ఎరువులతో సేద్యం చేస్తూ పెట్టుబడులని తగ్గించుకునే మేలైన మార్గమిది. ఆ విధంగానే పెద్దపల్లి జిల్లా, హరిపురం గ్రామానికి చెందిన శ్రీ వనిత దేశీ విత్తనాలతో అరుదైన నల్ల రకం వరిని సాగు చేస్తోంది. నాణ్యమైన ,ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యం అంటోంది రైతు శ్రీ వనిత.

ప్రకృతి వ్యవసాయంలో చవుడు భూములకు పంచామృతాలు, కషాయాలు, మిశ్రమాలు వేయడం వల్ల కొంత కాలానికి చవుడు తగ్గిపోతుంది. ఇతర భూములతో సమంగా దిగుబడులు ఇస్తాయి. సాగు నీరు అందుబాటులో ఉంటే ఏ భూమిలో, ఏ పంటనైనా పండించుకోవచ్చు. రసాయన వ్యవసాయంతో నష్టపోయే కన్నా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతో పంటలు పండించుకుని ఆదాయంతోపాటు ఆరోగ్యాన్నీ పొందవచ్చు అని అంటున్నారు శ్రీ వనిత.


Show Full Article
Print Article
Next Story
More Stories