బ్యాంకులు 15 రోజుల్లో కేసీసీ జారీచేయాలి.. లేదంటే రైతులు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు..!

Banks Should Issue KCC Within 15 Days Otherwise Farmers can Call the Helpline Number and Complain
x

బ్యాంకులు 15 రోజుల్లో కేసీసీ జారీచేయాలి.. లేదంటే రైతులు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు..!

Highlights

Kisan Credit Card: రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పరికరాలు కొనడానికి డబ్బు అవసరమవుతుంది.

Kisan Credit Card: రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పరికరాలు కొనడానికి డబ్బు అవసరమవుతుంది. చాలా మంది రైతులు ఈ ఖర్చులను భరిస్తున్నారు అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్న రైతులు వీటిని భరించలేరు. అందుకే ప్రభుత్వం గ్యారెంటీ లేకుండా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు మంజూరుచేస్తుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో బ్యాంకులు కేసీసీ కార్డు జారీచేయాలి. తర్వాత రుణం మంజూరవుతుంది.

ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతులకు సరైన సమయంలో సరసమైన వడ్డీ రేట్లకు రుణాలు అందించడం. అయితే కొన్నిసార్లు బ్యాంకింగ్ వ్యవస్థలో కొంత జాప్యం జరుగుతోంది. దీని కారణంగా రుణం సకాలంలో లభించదు రైతులకు ఆలస్యం అవుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా రైతు దరఖాస్తును స్వీకరించిన తర్వాత 15 రోజులలోగా లేదా 2 వారాల్లోగా కిసాన్ క్రెడిట్ కార్డును అందించాలని తెలిపింది. దీనిపై అవగాహన పెంచేందుకు ప్రతి గ్రామంలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.

బ్యాంకు పనితీరు సరిగ్గా లేక అనేక సార్లు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యవసాయ పనుల మధ్య రోజూ గ్రామం నుంచి నగరానికి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. దరఖాస్తు చేసి 15 రోజులు గడుస్తున్నా కేసీసీ జారీ చేయకుంటే రైతులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో రైతులు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. బ్యాంకు ఉద్యోగుల వైఖరితో విసిగిపోయినట్లయితే అధికార పరిధిలోకి వచ్చే బ్యాంకు శాఖ లేదా కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.

రైతుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 0120-6025109 లేదా 155261 కూడా జారీ చేశారు. అంతేకాదు కస్టమర్ ఈ-మెయిల్ ID ([email protected])కి మెయిల్ చేయవచ్చు. కావాలనుకుంటే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి సమస్య పరిష్కారం కోసం డిమాండ్‌ చేయవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. కావాలంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ సందర్శించడం ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories