ఒకప్పుడు నష్టాలు, ఇప్పుడు అవార్డులు.. ఆదర్శ రైతు విజయగాధ..

ఒకప్పుడు నష్టాలు, ఇప్పుడు అవార్డులు.. ఆదర్శ రైతు విజయగాధ..
x
Highlights

రసాయన ఎరువులతో వ్యవసాయంలో లాభం లేదనుకున్నాడు ఆ రైతు. వ్యవసాయం చేయడం దండగ అనుకున్నాడు. వ్యవసాయానికి స్వస్తి చెప్పాలనుకునే సమయంలో ప్రకృతి వ్యవసాయం...

రసాయన ఎరువులతో వ్యవసాయంలో లాభం లేదనుకున్నాడు ఆ రైతు. వ్యవసాయం చేయడం దండగ అనుకున్నాడు. వ్యవసాయానికి స్వస్తి చెప్పాలనుకునే సమయంలో ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యత తెలుసుకుని, ఇపుడు లాభాసాటిగా వ్యవసాయం చేస్తున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు కాకని శివనారయణ. ప్రకృతి సాగులో అంతర్జాతీయ ఖ్యాతి కూడా లభించింది ఆయనకి మరి ఆ రైతు వ్యవసాయం ఏంటో చూడాలంటే గుంటూరు జిల్లా అన్నవరంలోని అరటి తోటకు వెళ్లాల్సిందే.

గుంటూరు జిల్లా కొల్లిపార మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఈయన పేరు కాకని శివనారయణ. ఈయనకు వ్యవసాయం అంటే మక్కువ తనకున్న సొంత పోలంలో అర ఎకరాతో పాటు కౌలుకు పోలం తీసుకుని రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తూ జీవనం కోనసాగిస్తున్నారు. అయితే రసాయన ఎరవులతో శివనారయణకు వ్యవసాయం తో అపులు తప్ప ఆదాయం లేదు దీంతో వ్యవసాయం దండగని ఇక వ్యవసాయానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు కాకని శివ నారా‍యణ. ఆ సమయంలోనే అనంతపురం జిల్లాకు చెందిన కమ్యూనీటి రిసోర్స్ పర్సన్ రంగప్ప పరిచయమయ్యారు. ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కల్పిస్తూ ఎలాంటి రసాయనాలు వాడనవసరం లేదని చెప్పడంతో ప్రకృతి వ్యవసాయం అంటే ఎలా ఉంటుందో చూడాలని ప్రకృతి సాగును మొదలుపెట్టారు రైతు శివనారయణ.

ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రెండు దేశీ ఆవులను కూడా పెంచుతున్నారు రైతు శివనారయణ, అరటి పంటకు కావాల్సిన పోషకాలను సహజ రీతిలో జీవామృతం, ఝణ జీవామృతాలను అందిస్తున్నారు. అంతేకాకుండా పసుపు పంటను సైతం సహజ పద్ధతిలోనే సాగు చేస్తున్నాడు ఈ రైతు. తనకున్న అర ఎకరం పోలంలో 470 అరటి పిలకలు నాటారు, అరటి పిల్లకలు నాటిన నుంచి ప్రకృతి వ్యవసాయం తో పనులు చేస్తున్నారు. ఈ పంటకు గోమూత్రం, పేడ, పుట్టమట్టి ,బెల్లం, పప్పు దినుసులు, ఆవు పెరుగు పుల్లగా అయిన తర్వాత పిచికారి చేస్తే పురుగు చచ్చిపోతుందని కలిపి పిచికారి చేస్తున్నారు.

పెట్టుబడి తగ్గించుకుంటూ మేలైన దిగుబడులు సాధించడం ప్రకృతి వ్యవసాయ ముఖ్య లక్ష్యం. ఇందులోనూ కాస్తో కూస్తో పెట్టుబడులు ఉన్నా నాణ్యమైన పంట, లాభదాయక వ్యవసాయం సాధ్యపడుతుంది. ఆ విధంగానే ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శ రైతుగా నిలిచాడు, కేంద్ర స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయాన్ని లాభాసాటి వ్యవసాయంగా నిరూపించాడు ఈ అభ్యుదయ రైతు. అందుకుగానూ అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఎఫ్ఏవో ప్రత్యేకంగా గుర్తించి అవార్డును అందజేసింది.

అయితే ఈ ప్రకృతి వ్యవసాయం కోసం రెండు ఆవులు కూడా పెంచుతున్నారు రైతు శివనారయణ. గతంలో వ్యవసాయం చేస్తుంటే లక్షల రూపాయలు పెట్టబడి పెట్టాల్సి వచ్చిందని ఇపుడు ఏడాదికి 12వేల రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు కావడం లేదని తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తోందంటున్నారు. అరటి తోట వేసినందుకు సంతోషంగా ఉందంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories