పాడి గేదెల పెంపకంలో రాణిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతు

పాడి గేదెల పెంపకంలో రాణిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతు
x
Highlights

రెక్కడితేగాని డొక్కాడని కడు పేద కుటుంబం ఆ యువకుడిది. చదువులో రాణించకపోయినా ఏదో ఒకటీ సాధించాలనే తపన అతనిది పెట్టుబడి పెట్టె స్థోమత లేదు అనుభవం లేదు...

రెక్కడితేగాని డొక్కాడని కడు పేద కుటుంబం ఆ యువకుడిది. చదువులో రాణించకపోయినా ఏదో ఒకటీ సాధించాలనే తపన అతనిది పెట్టుబడి పెట్టె స్థోమత లేదు అనుభవం లేదు అయినా ఆర్ధికంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నాడు పాడి గేదాల పెంపకాన్ని చేపట్టాడు సిరులు కురిపిస్తున్నాడు. పాడిగేదల పెంపకంలో రాణిస్తున్న నిరుపేద యువ రైతు బాలరాజుపై ప్రత్యేక కథనం.

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలానికి చెందిన బాలరాజు పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువును ఆపేసాడు. తల్లిదండ్రులు కూలీ పనిచేసి కుటుంబాన్ని నెట్టుకస్తున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్ధికంగా సహకరించాలనుకున్నాడు. పాడి పెంపకం గురించి తెలుసుకున్నాడు. గేదెల పెంపకాన్ని చేపట్టాడు. చిన్నప్పటి నుంచి బాలరాజ్ కు పాడి గేదేలను పెంచాలనే ఆలోచన ఉండేది. బాలరాజ్ అమ్మ మహిళ సంగంలో సభ్యురాలు. మహిళ సంగంలో ఐకేపీ ద్వారా బ్యాంకులో లోను తీసుకున్నాడు. తమిళనాడు నుంచి 5 మొర్రా గేదేలను తీసుకొచ్చాడు, గేదెల పెంపకాన్ని ప్రాంభించాడు.

బాలరాజ్ ఎంతో పట్టుదలతో గేదేలను మంచిగా చూసుకుంటూ, వాటి ద్వారా వచ్చే పాలను అమ్మి రెండు సంవత్సరాల్లోనే బ్యాంకు లోను కట్టేశాడు. 5 గేదెలతో ప్రారంభించిన తన వ్యాపారం ఇప్పుడు 25 గేదెలకు చేరుకుంది. గేదెలకు సమయానికి తగ్గట్టుగా ఆహారాన్ని అందిస్తూ ఎంతో ఆరోగ్యంగా పెంచుతున్నాడు పాల ఉత్పత్తి కూడా ఎక్కువగానే వస్తోందంటున్నాడు బాలరాజ్.

గేదెల పెంపకంలో ఎవ్వరి సలహాలు తీసుకోలేదని తల్లిదండ్రుల సహాయంతో ఈ డైరీని నిర్వహిస్తున్నానంటూ గర్వంగా చెబుతున్నాడు బాలరాజు. ఒక్కో గేదె పూటకు 3 లీటర్లు రోజుకు 6 లీటర్లు పాలు ఇస్తాయని, పాల ఉత్పత్తితో అన్ని ఖర్చులు ఫోను నెలకు 30 వేలు మిగులుతున్నాయని అంటున్నాడు. పాల ఉత్పత్తిలో లాభాలను సాధిస్తూ ఆర్ధికంగా ఎదుగుతున్న బాలరాజ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు తన అప్పులన్నీ తీర్చుకుని ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories