ఆకుకూరల సాగుతో ఆదాయం బాగు

ఆకుకూరల సాగుతో ఆదాయం బాగు
x
Highlights

ఈ రైతు పేరు నాగరాజు కాదు కాదు ఆకుకూరల నాగరాజు. తన ఇంటి పేరునే ఆకుకూరలుగా మార్చుకున్న నాగరాజు గత 30 ఏళ్లుగా ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. ఏడాది పొడవునా...

ఈ రైతు పేరు నాగరాజు కాదు కాదు ఆకుకూరల నాగరాజు. తన ఇంటి పేరునే ఆకుకూరలుగా మార్చుకున్న నాగరాజు గత 30 ఏళ్లుగా ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండిస్తూ తాను లాభాలను సాధించడం మాత్రమే కాదు తనతో పాటు తోటి వారికి ఉపాధిని కల్పిస్తున్నాడు. సాగులో రాణిస్తున్నాడు.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో ఆకుకూరల సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. నెలరోజులకే మొక్క ఎదుగుదలకు రావటం, ఏడాది పొడవున ఈ తోటలు సాగుచేసే అవకాశం ఉండటంతో రైతులు ఆకుకూరల సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నాగరాజు ఆకుకూరల సాగు చేస్తున్నాడు. ప్రతీ నెల నికర ఆదాయాన్ని పొందుతూ తోటి వారికి ఉపాధిని కల్పిస్తున్నాడు.

అనంపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతు నాగరాజు. ఈ రైతుకు 6 ఎకరాల పొలం ఉంది. నాగరాజుది వ్యవసాయ కుటుంబం 30 సంవత్సరాలగా వ్యవసాయం చేస్తున్నాడు. అందులో భాగంగా ఏడాది పొడవున డిమాండ్ ఉన్న ఆదాయాన్నిచ్చే ఆకుకూరలను పండిస్తున్నారు. స్వతహాగా తాను నాలుగు రాళ్ళన్ని సంపాదించడంతో పాటు తోటివారికి ఉపాధిని కల్పిస్తున్నాడు.

ఆరు ఎకరాల పొలాన్ని మూడు భాగాలుగా విభజించుకున్నాడు. రెండేసి ఎకరాల్లో మార్చి మార్చి ఆకుకూరలను సాగు చేస్తున్నాడు. అలా ఎప్పటికీ సంత్సరం పొడవునా ఆకుకూరలను పండిస్తున్నాడు. ఇప్పటికే మూడు కోతలు పూర్తయ్యాయి. నాలుగో కోతలో పంటను విక్రయించకుండా విత్తనానలు తయారు చేసుకుని వాటినే తిరిగి పంటకు కావాల్సిన విత్తనంగా వినియోగిస్తానంటున్నాడు ఈ రైతు. తద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటున్నాడు.

బోరు బావి ఆధారంగా ఆకుకూరల సాగు చేస్తున్నాడు ఈ రైతు. 3 రోజులకు ఒకసారి నీటి తడులను అందిస్తున్నాడు. ఆకుకూరల్లో ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. వాటిపై రసాయనాలు చల్లి వ్యాపారం చేసుకోవాలనుకోలేదు ఈ రైతు. గో వ్యర్ధాలను, వర్మికంపోస్ట్‌ను ఎరువులుగా పంటకు అందిస్తున్నాడు. నాణ్యమైన ఆరోగ్యకరమైన దిగుబడిని సాధిస్తున్నాడు. 3 నెలల పంటకు గాను 60 వేల పెట్టుబడి పెడుతున్నాడు. నెలకు అన్ని ఖర్చులు పోను 60 వేల రూపాయల నికరాదాయాన్ని పొందుతున్నాడు. ఆకుకూరల సాగు వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

వాణిజ్య పంటలను సాగు చేసి అనుకున్న దిగుబడి రాక ఆదయాం దక్కక చాలా మంది రైతులు సాగులో కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. వారిలా కాకుండా ఉన్న పొలాన్ని తనకు అనుకూలంగా ఆకుకూరలను సాగు చేసుకుంటూ తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా నికర ఆదాయం పొందుతున్న రైతు నాగరాజు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తోటి రైతులను ఆలోచింపజేస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories