ఉల్లి సాగులో రాణిస్తున్న అదిలాబాద్ రైతు

ఉల్లి సాగులో రాణిస్తున్న అదిలాబాద్ రైతు
x
Highlights

అమ్ముకోవడానికి నిరీక్షణ లేదు, డిమాండ్ లేదని దిగులు లేదు కాసులతో రైతుల కన్నీటిని తుడిచే పంట ఉల్లి. రైతు ఇంటిలో రాబడుల రాశులు పోసే పంట ఉల్లి పంట. ఆ...

అమ్ముకోవడానికి నిరీక్షణ లేదు, డిమాండ్ లేదని దిగులు లేదు కాసులతో రైతుల కన్నీటిని తుడిచే పంట ఉల్లి. రైతు ఇంటిలో రాబడుల రాశులు పోసే పంట ఉల్లి పంట. ఆ విధంగానే ప్రతికూల వాతావరణంలోనూ ఉల్లి సాగులో అద్బుతాలు సాధిస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు వర్షకాలంలోనూ ఉల్లి సాగు చేస్తే లాభాలను పొందవచ్చు అని నిరూపిస్తున్న రైతు అర్జున్ ఉల్లి సాగుపై ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్ జిల్లా రైతులు అనగానే మూస దోరణి సాగు పత్తి పంట తప్ప మరోక పంటలు పండించలేరని ఒక అపవాదు, కాని ఇంద్రవెల్లి మండలం దనోరా బి గ్రామానికి చెందిన రైతు దయనంద్ అర్జున్ అద్బుతాలు సాధిస్తున్నారు. సాధారణంగా ఉల్లిని రబీ సీజన్ లో సాగు చేస్తుంటారు, రబీ సీజన్ లో ఉల్లిని సాగు చేసినా ధరలు అంతంతమాత్రమే ఉంటాయి కానీ ధరలు లేని సమయంలో పంటలు పండించిన రైతులకు దక్కే లాభాలు ఉండవు పైగా ఉల్లి సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఉల్లి డిమాండ్ ఉన్న సమయంలో పండిస్తే రైతులకు కాసుల వర్షం కురుస్తోంది.

సాధారణంగా ఉల్లి కొరత వర్షకాలంలో ఉంటుంది. ఇదే సమయంలో పంటలు పండిస్తే రైతులకు భారీగా లాభాలు వస్తాయి. అందులో భాగంగా రైతు అర్జున వర్షకాలంలో సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం లో సైతం దిగుబడులు సాధిస్తూ అందరిని అకట్టుకుండటం విశేషం. ఉల్లి పంట స్వల్ప కాలిక పంట‌‌ రబీలో సాగు చేసి పండిన పంటను అమ్మితే కిలో పది రుపాయలకు మించదు. అదే వర్షాకాలంలో సాగు చేసి పండిన తర్వాత కిలో డెబ్బై రుపాయలకు అమ్ముతున్నారు అంటే వర్షకాలంలో ఉల్లిసాగు వచ్చే లాభాలు అంతాఇంతాకాదు. ఆ విధంగానే వర్షకాలం ఉల్లి సాగు చేస్తే ఎకరాకు పదిలక్షలు అర్జించవచ్చునని నిరూపిస్తున్నారు రైతు అర్జున్.

అయితే ఉల్లి సాగుకు అయ్యే పెట్టుబడి చాలా తక్కువ పైగా ఎరువులు , రసాయనిక మందుల అవసరం ఉండదు. అందువల్ల ఉల్లి సాగు పెట్టుబడి భారం కాదంటున్నారు రైతు అర్జున్. ఇక ధరలతో పెట్టుబడి వ్యయం పోల్చితే భారీగా ఆదాయం వస్తుంది. అందుకే మార్కెట్ డిమాండ్ ను బట్టి ఉల్లి సాగు చేస్తే లాభాలలో ఉల్లిమించిన పంటలేదు ఒకవేళ వర్షాకాలంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నా‌ ఆదాయం బాగానే ఉంటుంది. రబీలో నాలుగు ఎకరాలు పండించిన ఆదాయం...కన్నా వర్షాకాలంలో ఆర ఎకరంలో పండించిన ఆదాయం అధికంగా వస్తుందని అంటున్నారు రైతు అర్జున్. డిమాండ్ లేని ధరలు లేని సమయంలో పంటలు పండించకుండా మార్కెట్ డిమాండు కు అనుగుణంగా పంటలు పండిస్తూ లాభాలు అర్జిస్తున్నారు రైతు అర్జున్. ఆయన బాటపట్టడానికి మిగితా రైతులు సిద్దమవుతున్నారు. సర్కార్ కూడ ఇలాంటి రైతులను ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories