Top
logo

గల్ఫ్ దేశాన్ని వద్దనుకుని...లక్షణంగా సంపాదిస్తున్నాడు

గల్ఫ్ దేశాన్ని వద్దనుకుని...లక్షణంగా సంపాదిస్తున్నాడు
X
Highlights

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెలుతున్న ఎంతో మంది యువత అక్కడ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు ఉన్న ఊరును, కుటుంబాన్ని...

ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెలుతున్న ఎంతో మంది యువత అక్కడ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు ఉన్న ఊరును, కుటుంబాన్ని వదిలి నరకయాతనను అనుభవిస్తున్నారు ఈ నేపథ్యంలో గల్భ దేశాల్లో బానిసగా బ్రతకడం కంటే స్వదేశంలో స్వశక్తితో సంపాదిస్తూ సగర్వంగా బ్రతకవచ్చని నిరూపిస్తున్నాడు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన యవరైతు. ముర్రా జాతి గేదెల పెంపకంతో తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తూ పాడి పరిశ్రమ రంగంలో రాణిస్తున్నాడు అబ్దుల్ సద్దాం హుస్సేన్‌.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన అబ్దుల్ సద్దాం హుస్సేన్ ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు గత 10 సంవత్సరాలుగా గల్ఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో గల్ఫ్‌లో అష్టకష్టాలు పడేకంటే సొంతంగా సొంత ఊరిలో ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకున్నాడు. తన సొంత భూమిలో పశువుల పెంపకాన్ని మొదలు పెట్టాడు. పాడి పరిశ్రమలో తాను ఉపాధి పొందడమే కాకుండా తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాడు.

పెంపకానికి ముర్ర జాతి గేదెలను ఎన్నుకున్నాడు. వీటిని ప్రత్యేకంగా గుజరాత్‌ నుంచి కొనుగోలు చేశాడు. ప్రస్తుతం డెయిర్‌ ఫాంలో 16 గేదెలు ఉన్నాయి. ఒక్కో గేదెను 80 వేలు పెట్టి కొనుగోలు చేశారు. ఒక్కో గేదె 12 లీటర్ల చొప్పున రెండు పూటలు పాలు ఇస్తుంది. ప్రతీ రోజు 200 లీటర్ల పాలను విక్రయిస్తూ నెలకు 3 లక్షల ఆదాయం సంపాధిస్తున్నాడు యువ రైతు సద్దాం హుస్పేన్‌. నేటి యువత సంపాదన కోసం గల్ఫ్ దేశాలకు పయనమవకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తూ స్వదేశంలో స్వశక్తితో ఎంతో గర్వంగా బ్రతకవచ్చంటూ నిరూపిస్తున్న అబ్దుల్ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.


Next Story