పాడి రైతులకు బంపర్ ఆఫర్.. రూ.800 కోట్ల రుణాలు

పాడి రైతులకు బంపర్ ఆఫర్.. రూ.800 కోట్ల రుణాలు
x

పాడి రైతులకు బంపర్ ఆఫర్.. రూ.800 కోట్ల రుణాలు 

Highlights

తెలంగాణ పాడి రైతులకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. పాల ఉత్పత్తే ప్రధాన జీవనాధారంగా బ్రతికే పాడి రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో పాల...

తెలంగాణ పాడి రైతులకు రాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. పాల ఉత్పత్తే ప్రధాన జీవనాధారంగా బ్రతికే పాడి రైతులను ఆదుకోవడంతో పాటు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు సర్కర్ భారీ మొత్తంలో బర్రెలు, ఆవులను కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. రానున్న రెండేళ్లలో సుమారు 800 కోట్ల రుణాలను పాడి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాడి రైతులు ఏ రాష్ట్రం నుంచైనా పాడి పశువులను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే ముర్రా, సంకరజాతి పశువులను మాత్రమే కొనుగోలు చేయాలని షరతు విధించింది. ఒక్కో పాడి పశువు కొనుగోలుకు సుమారు 75 వేల రూపాయల వరకు చెల్లిస్తారు. అదే విధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువులు కావడంతో అవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడే వరకు సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. అందుకు గాను రైతులు ప్రతి నెల కొద్ది మొత్తంలో నగదు చెల్లించాల్సి ఉంటుంది.

కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పాడి రైతుకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభ‌ుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. పాడి రైతుల ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు భారీ మొత్తంలో రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఓ వైపు రైతుకు అండగా నిలుస్తూనే మరో వైపు రాష్ట్రంలో పాల కొరతను అధిగమించేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వం పెద్దఎత్తున బర్రెలు, ఆవులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. స్త్రీనిధి పథకం ద్వారా సుమారు 800 కోట్ల రూపాయల వరకు పాడి రైతులకు రుణాలు అందించనుంది. రానున్న రెండేళ్లలో సుమారు లక్ష బర్రెలు, ఆవులు అందించేందకు సన్నాహాలు చేస్తోంది. దీనితో కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన పాడి రైతులకు ఊరట లభించినట్లైంది.

రుణాలు అందించడంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతనిస్తోంది సర్కార్. ఇప్పటివరకు 14 వేల 476 బర్రెలు, ఆవులను పాడి రైతులకు అందించింది. రైతులు ఇతర రాష్ర్టాల నుంచి పశువులను కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే అధికంగా పాలనిచ్చే ముర్రా, సంకరజాతి వాటినే కొనుగోలు చేయాలని షరతు విధించింది. పాడిరంగంలో అనుభవం ఉన్న రైతులకు నాలుగు బర్రెలు, ఆవులకు కూడా రుణం అందిస్తారు. ఒక్కో బర్రె కొనుగోలుకు సుమారు 75 వేల వరకు చెల్లిస్తారు. దీనితో పాటే రెండు నెలలకు సరిపడా దాణా కోసం 7,200 రూపాయలు అందిస్తారు. రవాణా ఖర్చుల కింద 3 వేలు, రవాణా సమయంలో బర్రె ఇన్సూరెన్స్‌కు 443 రూపాయలు అందిస్తారు. నాలుగేళ్ల వరకు ఇన్సురెన్స్ కింద 5088 రూపయాలను చెల్లిస్తారు. ఇలా మొత్తంగా 90వేల రూపాయల వరకు అందిస్తారు. ఈ రుణాన్ని 11.5శాతం వడ్డీకే అందజేస్తారు. గోపాలమిత్ర, పాలమిత్రల ద్వారా ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నారు. పాడి రైతులు రుణం తీసుకున్న తరువాత మూడో నెల నుంచి 2524 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories