రైతుకు లాభం... వినియోగదారుడికి ఆరోగ్యమే వీరి ధ్యేయం

రైతుకు లాభం... వినియోగదారుడికి ఆరోగ్యమే వీరి ధ్యేయం
x
Highlights

ఉన్న భూమినే నమ్ముకొని కమతాలుగా మార్చి బంగారు పంటల సాగు బాట పట్టారు అక్కడి రైతులు. భూస్వాములుకాలేకపోయామే అనే భాద లేకుండా ఉన్న ఏకరా భూమిలోనే ఏకంగా 14...

ఉన్న భూమినే నమ్ముకొని కమతాలుగా మార్చి బంగారు పంటల సాగు బాట పట్టారు అక్కడి రైతులు. భూస్వాములుకాలేకపోయామే అనే భాద లేకుండా ఉన్న ఏకరా భూమిలోనే ఏకంగా 14 పంటలు పడించారు తోటివారిని ఔరా అనిపిస్తున్నారు. చిన్న రైతులు చిన్నకమతాల ప్రకృతి సాగుపై ముగ్ధులైన ప్రభుత్వ అధికారులు సైతం వారి పద్ధతులకు ఆకర్షితులై పరిశీలన బాట పట్టారు. నేటి తరం యువతకు ఆదర్శంగా నిలవడమే కాదు ఇప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రం విద్యా వ్యవసాయ శిక్షణా కేంద్రానికి కేరాఫ్ గా నిలుస్తోంది మరి ఇంతటి ఘణతను సాధించిన ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన రైతులపై మీ నేలతల్లి ప్రత్యేక కథనం.

ఈ ఇద్దరు యువరైతుల వేణు , వెంకటరెడ్డి. వీరిద్దరూ ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన రైతులు ఇద్దరూ చదివింది ఎంబీఏ. పేరుమోసిన విత్తన కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నా వీరికి ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం వీరిని కలచివేసేవి రైతుకు సరైన విత్తనం అందక, ఎరువుల వినియోగం తెలిక పడుతున్న ఇబ్బదులు చూసి చలించిపోయేవారు దీంతో వీరు రైతులకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో మనస్సును వ్యవసాయం వైపు మళ్లించారు దీంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలి తమకు ఇష్టమైన వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు.

అయితే అందరిలా పదుల సంఖ్యలో భూములు ఉన్న ఆసామికాక పోయినా తనకు ఉన్న ఎకరం ఎకరాల్లోనే ఏకంగా 14 రకాల కాయగూరలు, పూలు పండిస్తున్నారు ఈ యువరైతులు అదీ పూర్తి ప్రకృతి విధానంలో. తమకు ఇష్టమైన రంగం కావడంతో తమకున్న జానడు భూమిలోనే అత్యధిక లాభాలు వచ్చేలా పంటలు పండించాలని నిర్ణయించుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త కొత్త పంటల గురించి తెలుసుకున్నారు. వాటిని స్థానికంగా సాగు చేస్తే రైతుకు వచ్చే లాభాలేంటో తెలుసుకున్నారు. అందుకోసం ఆయా పంటలను సాగు చేస్తున్న రైతులను కలిసి సాగు వివరాలను తెలుసుకున్నారు. వాటి ఆచరణలో పెట్టారు.

ఉద్యానవన శాఖ అధికారుల ప్రోత్సాహంతో పాటు తమకున్న విజ్ఞానాన్ని జోడించి షేడ్ నెట్ ను ఏర్పాటు చేసుకున్నారు. డ్రిఫ్ ఇరిగేషన్ పద్దతిలో నీటితడిని అందించి ఆరోగ్యకరమైన మేలు జాతి రకాల పంటలను పండిస్తున్నారు.

బ్రకోలి, యురోపియన్ కుకుంబర్‌, టమోట, క్యాప్సికమ్, రెడ్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బేబీకార్న్, వాటర్ మిలాన్, బంతి , చామంతి, వంటి పంటలను సాగు చేస్తున్నారు ఈ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్. అయితే చిన్న చిన్న కమతాలు ఏర్పాటు చేసుకుని పండించిన ఈ పంటలను తమ క్షేత్రంలోనే విక్రయిస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఈ ఆహారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలే అక్కడకు వస్తున్నారు. అంతే కాదు తోటి రైతులకు సాగులో పాటించాల్సిన మెళకువలపై శిక్షణను అందిస్తున్నారు వీరు. ఎంతో మందికి ఇప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రం ఓ సాగు శిక్షణా ప్రాంతంగా మారింది.

విదేశీ పంటలను స్వదేశంలో పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తూ సాగులో రాణిస్తున్న ఈ యువరైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంత చదువు చదివినీ ఇవ్వని సంతృప్తిని ఈ రైతులు సాగులో పొందుతున్నారు. తోటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories