SSC Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో వివిధ పోస్టల భార్తికి నోటిఫికేషన్ విడుదల..

SSC Notification: శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.

S. Srikanth
Updated on: 21 July 2020 3:00 PM IST
SSC Notification: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో వివిధ పోస్టల భార్తికి నోటిఫికేషన్ విడుదల..
X
Representational Image

SSC Notification: శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు. అలంటి పోలీస్ వ్యవస్థ లో ఉద్యోగం చేయాలనే కోరిక యువతలో ఎక్కువగా ఉంటుంది. అయితే పోలీస్ ఉద్యోగం కోసం శ్రమిస్తున్న వారికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC శుభవార్త తెలిపింది. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 5846 కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేయాలంటూ డిప్యూటీ సకమీషనర్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ను లేక ద్వారా కోరారు. అయితే, ఇప్పటికే 1564 పోస్టుల భర్తీ కి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ కాకుండా మరో 5846 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది అని తెలిపింది. వీటి కోసం అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in లో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు అని తెలిపింది.

మొత్తం ఖాళీల వివరాలు:

*మొత్తం ఖాళీలు- 5846

* కానిస్టేబుల్ పురుషులు- 3433

* కానిస్టేబుల్ మహిళలు- 1944

కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్‌మెన్:

* పురుషులు: 226

* కమాండో పురుషులు- 243

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరిన్ని వివరాల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..


S. Srikanth

S. Srikanth

Next Story