TSPSC Jobs: ఆ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..

TSPSC Jobs: ఆ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..

Arun Chilukuri
Published on: 21 Jun 2023 2:23 PM IST
TSPSC AMVI 2023 Hall Tickets Released
X

TSPSC Jobs: ఆ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..

TSPSC Jobs: తెలంగాణలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు నిర్వహించనున్న నియామక పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్పీయస్సీ బుధవారం విడుదల చేసింది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ (TSPSC) అందుబాటులో ఉంచింది. ఈ నెల 28న ఏఎంవీఐ నియామక పరీక్ష జరగనుంది. ప్రాక్టీసు కోసం వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ లింకును కూడా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

TSPSC AMVI నోటిఫికేషన్‌ ద్వారా 113 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. వీటిలో మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story