తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

TS 10th Supplementary Results: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

Arun Chilukuri
Published on: 2 Sept 2022 2:55 PM IST
TS SSC Supplementary Results 2022 Out
X

తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

TS 10th Supplementary Results: తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేన ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 48,167 మంది హాజరుకాగా 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత 82.21 శాతం కాగా, బాలురు 78.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత హాల్‌ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్‌ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై వస్తాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story