Andhra Pradesh: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

Andhra Pradesh: పదో తరగతి పరీక్షా విధానంలో ఏపీ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

Arun Chilukuri
Updated on: 22 Aug 2022 5:53 PM IST
Tenth Exam Procedure Changes in Andhra Pradesh
X

Andhra Pradesh: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లకు కుదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పదవ తరగతిలో 11 పేపర్లు ఉండేవి. కరోనా కారణంగా ఏడు పేపర్లకు కుదించారు. తాజాగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లుగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ నేపథ్యంలో 6 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story