Telangana: వైస్‌ ఛాన్స్‌లర్ల పోస్టులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్

Telangana: రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Jyothi
Published on: 28 Jan 2024 12:48 PM IST
Telangana government invites applications for posts of vice chancellor in 10 State universities
X

Telangana: వైస్‌ ఛాన్స్‌లర్ల పోస్టులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్

Telangana: తెలంగాణలోని పలు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్‌లర్ల పోస్టులకు రాష్ట ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని దాదాపు పది యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులకు అప్లికేషన్లు స్వీకరిస్తోంది. ఉస్మానియా వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీలతో పాటు మహాత్మగాంధీ, శాతవాహన, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్‌లర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. WWW.TSCHE.AC.IN వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్లు సమర్పించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.

Jyothi

Jyothi

Next Story