ITBP Jobs 2023: పది చదివి లైసెన్స్‌ ఉంటే చాలు.. ఐటీబీపీలో కానిస్టేబుల్ డ్రైవర్‌ ఉద్యోగాలు..!

ITBP Jobs 2023: పది చదివి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు.

Arun Chilukuri
Published on: 30 Jun 2023 11:42 AM IST
ITBP Constable Driver Recruitment 2023 Check for all Details
X

ITBP Jobs 2023: పది చదివి లైసెన్స్‌ ఉంటే చాలు.. ఐటీబీపీలో కానిస్టేబుల్ డ్రైవర్‌ ఉద్యోగాలు..!

ITBP Jobs 2023: పది చదివి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్న నిరుద్యోగులకి ఇది శుభవార్తని చెప్పవచ్చు. ఎందుకంటే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్‌ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 458 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 జూన్ 2023 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 26 జూలై 2023 వరకు సమయం కేటాయించారు. ఆన్‌లైన్‌లో ఈ విధంగా అప్లై చేయండి.

అప్లై చేసే విధానం

1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.inకి వెళ్లాలి.

2. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే ముందుగా రిక్రూట్‌మెంట్ లింక్‌లోకి వెళ్లాలి.

3. తర్వాత ITBPFలో కానిస్టేబుల్ (డ్రైవర్)-2023 పోస్టుకు రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.

4. తర్వాత నెక్స్ట్‌ పేజీ లింక్‌పై ఓపెన్‌ చేయాలి.

5. అడిగిన వివరాలని అందించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

6. తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.

7. జనరల్ కేటగిరీ, OBC, EWS రూ.100 చెల్లించాలి. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

ఖాళీ వివరాలు

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 458 పోస్టులను భర్తీ చేస్తారు. అన్ని వర్గాల అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీలలో జనరల్ కేటగిరీకి 195, ఓబీసీకి 110, ఈడబ్ల్యూఎస్‌కు 42, ఎస్సీకి 74, ఎస్టీకి 37 పోస్టులు కేటాయించారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేయడానికి ముందు ఒక్కసారి నోటిఫికేషన్‌ పూర్తిగా చదవండి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story