Indian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు..!

Indian Air Force 2022: నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 9:01 PM IST
Indian Air Force Recruitment 2022 15 Group C Civilian Posts
X

Indian Air Force 2022: నిరుద్యోగులకి శుభవార్త.. ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు..!

Indian Air Force 2022: నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి గ్రూప్‌ సి సివిలియన్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు సికింద్రాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నైలలో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి పలు వివరాలని తెలుసుకుందాం.

మొత్తం పోస్టుల సంఖ్య 15. అన్ని గ్రూప్‌ 'సీ' సివిలియన్‌ పోస్టులు. ఇందులో వార్డ్‌ సహాయక్‌, హౌజ్‌ కీపింగ్‌ స్టాఫ్‌, కుక్‌, సివిలియన్ మెకానికల్‌ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టునుబట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సు పాస్‌ అయి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

షార్ట్‌లిస్టింగ్‌/రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఫిజికల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్దులు పోస్టును బట్టి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ జులై 20, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారికి వెబ్‌సైట్‌ https://indianairforce.nic.in/ సందర్శించండి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story