IIT Roorkee Recruitment 2023: ఐఐటీ రూర్కీలో గ్రూప్‌ సి ఉద్యోగాలు.. పూర్తి సమాచారం తెలుసుకోండి..!

IIT Roorkee Recruitment 2023: ఐఐటీలో ఉద్యోగం చేయాలని కలలు కనే నిరుద్యోగులకి ఇది మంచి అవకాశం అని చెప్పాలి.

Jyothi
Updated on: 26 Aug 2023 11:01 AM IST
IIT Roorkee Recruitment 2023 for Group b and Group C posts check for details
X

IIT Roorkee Recruitment 2023: ఐఐటీ రూర్కీలో గ్రూప్‌ సి ఉద్యోగాలు.. పూర్తి సమాచారం తెలుసుకోండి..!

IIT Roorkee Recruitment 2023: ఐఐటీలో ఉద్యోగం చేయాలని కలలు కనే నిరుద్యోగులకి ఇది మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఐఐటీ రూర్కీ గ్రూప్‌ బి, సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ రూర్కీ అధికారిక వెబ్‌సైట్ iitr.ac.inకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేది ఆగస్ట్‌ 30గా నిర్ణయించారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద ఐఐటీ రూర్కీలో మొత్తం 78 ఉద్యోగాలని భర్తీ చేస్తారు. వీటిలో గ్రూప్ బి 31 ఉద్యోగాలు, గ్రూప్ 47 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి దరఖాస్తు రుసుము అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500, OBC/EWS కేటగిరీకి రూ.400 చెల్లించాలి. అదే సమయంలో SC / ST / PWD మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

అప్లై చేసే విధానం

దరఖాస్తు చేయడానికి ముందుగా iitr.ac.inకి వెళ్లి హోమ్ పేజీలోని కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయాలి. మినహాయించిన కేటగిరీలో రాకపోతే నిర్ణీత రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలి. అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి తదుపరి ఉపయోగం కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Jyothi

Jyothi

Next Story