Educational Excellence Awards 2023: విద్యారంగంలో ప్రతిభ చూపిన వారికి hmtv అవార్డులు

hmtv ప్రదానం చేయనున్న ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023

Arun Chilukuri
Updated on: 1 July 2023 3:34 PM IST
Educational Excellence Awards 2023 Organized by hmtv
X

Educational Excellence Awards 2023: విద్యారంగంలో ప్రతిభ చూపిన వారికి hmtv అవార్డులు

Education Excellence Awards 2023: విద్యా రంగంలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. రెండు రాష్ట్రాలు ఆకాశమే హద్దుగా పోటీపడుతున్నాయి. ఆరోగ్యకరమైన పోటీని మరింత ఉత్సాహపరిచేందుకు hmtv సంకల్పం చెప్పుకుంది. రెండు రాష్ట్రాల్లో విద్యారంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన దిగ్గజాలకు hmtv అవార్డులు ప్రదానం చేయనుంది. ఎడ్యుకేషన్ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్ 2023 అవార్డుల వేడుక హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఈరోజు రాత్రి ఏడు గంటలకు మొదలు కానుంది.

విశ్వసనీయతకు, వేగానికి మారుపేరుగా వార్తాకథనాలు ప్రసారం చేస్తున్న hmtv .... లక్షలాది మంది ప్రజల మన్ననలు పొందుతోంది. తెలుగు ప్రజల మదిలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది. తన ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ దూసుకెళుతోన్న hmtv... విద్యారంగంలో సేవలు అందించిన వారికీ పెద్దపీట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా... ఆ గొంతుకను వినిపించి... వారి ఉన్నతికి దోహదపడాలని సంకల్పించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story