DRDO: డీఆర్‌డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు – పూర్తి వివరాలు ఇలా!

దేశ రక్షణ రంగంలో ప్రముఖ స్థానం ఉన్న రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), ఇంజినీరింగ్ మరియు సైన్స్ విద్యార్థుల కోసం చక్కటి అవకాశం కల్పిస్తోంది. DRDO పరిధిలోని పలు ప్రయోగశాలల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Ramya Vegirouthu
Updated on: 6 July 2025 7:00 PM IST
DRDO: డీఆర్‌డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు – పూర్తి వివరాలు ఇలా!
X

DRDO: డీఆర్‌డీఓలో పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు – పూర్తి వివరాలు ఇలా!

DRDO: దేశ రక్షణ రంగంలో ప్రముఖ స్థానం ఉన్న రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), ఇంజినీరింగ్ మరియు సైన్స్ విద్యార్థుల కోసం చక్కటి అవకాశం కల్పిస్తోంది. DRDO పరిధిలోని పలు ప్రయోగశాలల్లో వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

హైదరాబాద్ CHESS లో 20 ఖాళీలు

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS), ఫిజిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 20 ఇంటర్న్‌షిప్ ఖాళీలు ప్రకటించింది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న గ్రాడ్యుయేట్‌ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు దీనికి అర్హులు. దరఖాస్తు చేయడానికి జులై 15 చివరి తేదీ.

డీఈఏఎల్ (DEAL)లో 45 పోస్టులు

డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ లాబొరేటరీ (DEAL) 45 ఇంటర్న్‌షిప్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు జులై 18 లోగా అప్లై చేయాలి.

ఎల్ఆర్‌డీఈ (LRDE)లో కూడా అవకాశాలు

ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE) కూడా ఇంటర్న్‌షిప్‌లను అందిస్తోంది. దీనికి జులై 14 చివరి తేదీగా పేర్కొన్నారు.

ఎంపిక విధానం, స్టైఫండ్ వివరాలు

ఈ ఇంటర్న్‌షిప్‌లకు అభ్యర్థుల ఎంపిక అకడమిక్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి DRDO నిబంధనల ప్రకారం నెలకు రూ.5000 స్టైఫండ్ అందజేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ

ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్ – drdo.gov.in ను సందర్శించాలి.

ఈ అవకాశాన్ని వినియోగించుకొని DRDOలో అనుభవం పొందాలని ఆసక్తిగల విద్యార్థులకు సూచన.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story