Police Recruitment: పోలీస్‌ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు

Police Recruitment: టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి మేరకు మార్పులు

Dhatripriya
Updated on: 13 Jan 2023 6:31 PM IST
Changes In Police Recruitment Final Exam Dates
X

Police Recruitment: పోలీస్‌ నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు

Police Recruitment: తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క విష‌యాన్ని వెల్లడించింది. పోలీస్‌ నియామ‌క తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేసిన‌ట్లు తెలిపింది. టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి మేరకు నాలుగు ప‌రీక్ష తేదీల్లో మార్పులు చేసిన‌ట్లు ప్రకటించింది. ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ప్రింట్స్‌), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది పోలీస్‌ నియామక మండలి. ఏప్రిల్‌ 23న జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్చినట్టు వెల్లడించింది. అలాగే ఎస్సై (ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేశారు. ఏఎస్సై (ఫింగర్‌ ప్రింట్స్‌) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, కానిస్టేబుల్‌ పరీక్ష ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story