యూపీలో దారుణ ఘటన.. అత్తను చితకబాదిన కోడలు !

యూపీలో దారుణ ఘటన.. అత్తను చితకబాదిన కోడలు !
x
యూపీలో దారుణ ఘటన.. అత్తను చితకబాదిన కోడలు !
Highlights

80 ఏళ్ల వృద్ధురాలు అందునా కదలలేక మంచానికే పరిమితమైన నిస్సహాయురాలు పైగా అత్తగారు. వరసకు కాకపోయినా వయసుకైనా గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆమెపై దారుణంగా దాడి...

80 ఏళ్ల వృద్ధురాలు అందునా కదలలేక మంచానికే పరిమితమైన నిస్సహాయురాలు పైగా అత్తగారు. వరసకు కాకపోయినా వయసుకైనా గౌరవం ఇవ్వాల్సింది పోయి ఆమెపై దారుణంగా దాడి చేసి చంపబోయిందో కోడలు. యూపీలో జరిగిన ఈ దారుణ ఘటన వైరల్‌గా మారింది.

ఇంట్లో ఓ మూలన కూర్చొన్న అత్తగారిపై కోడలు తన ప్రతాపం చూపించింది. వృద్ధురాలిపై విచక్షణరహితంగా చితకబాదింది. ఇష్టారీతిన ఆమెను కొడుతూ అసభ్యపదజాలంతో దూషించింది. అప్పటికీ కచ్చ తీరక చేతితో గొంతు నులిమి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించింది. అత్తగారు ప్రతిఘటించడంతో రగిలిపోయింది. ఆరు బయట ఉన్న అత్తను చేతులు పట్టుకుని ఈడ్చిపారేసింది. తన కసి తీరకపోవడంతో ఓ గిన్నె తీసుకొచ్చి పదేపదే కొట్టిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. అత్తపై దాడి చేసిన కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories