Viral Video: సినీ ఫక్కీలో పరిగెత్తించి మరీ కాల్చిపాడేశాడు..!

Viral Video: సినీ ఫక్కీలో పరిగెత్తించి మరీ కాల్చిపాడేశాడు..!
x
Highlights

దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని తుపాకీతో మరో వ్యక్తీ తరిమి..తరిమి మరీ కాల్చి చంపాడు.

తుపాకీతో బీభత్సం సృష్టించాడొకడు. సినీ ఫక్కీలో ఒక వ్యక్తిని వేటాడి..వేటాడి కాల్చి చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పెను సంచలనం సృష్టించిన ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీలో పట్టపగలు ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ద్వారకా పాలం విహార్‌లో కారులో వెళ్తున్న ఓ వ్యాపారిపై కాల్పులకు తెగబడ్డాడు. ప్రాణాలను కాపాడుకొనేందుకు వ్యాపారి కారు నుంచి బయటకు వచ్చి పరుగులు పెడుతున్నా ఆ దుండగుడు వదల్లేదు. మరో కారు మీదకు ఎక్కి మరీ కాల్పులు జరిపాడు. దుండగుడు హెల్మెట్ పెట్టుకోవడంతో గుర్తుపెట్టడం కష్టంగా మారింది. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. (వీడియో కర్టసీ: నవభారత్ టైమ్స్)

Show Full Article
Print Article
More On
Next Story
More Stories