Top
logo

పోలీసులకు చుక్కలు చూపిస్తున్న హాజీపూర్ సైకో ...

పోలీసులకు చుక్కలు చూపిస్తున్న హాజీపూర్ సైకో ...
X
Highlights

యదాద్రి జిల్లా బొమ్మలరామారం మండంలోని హాజీపూర్ గ్రామంలో ముగ్గురు యువతులను హత్యచేసిన హంతకుడు శ్రీనివాస్ రెడ్డి...

యదాద్రి జిల్లా బొమ్మలరామారం మండంలోని హాజీపూర్ గ్రామంలో ముగ్గురు యువతులను హత్యచేసిన హంతకుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు . పోలిసుల ప్రశ్నలకు మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు . శ్రీనివాస్ రెడ్డి మౌనంతో విచారణను ముందకు తీసుకెళ్లలేకపొతున్నారు పోలీసులు .. ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులను మరియు స్నేహితులను విచారించారు పోలీసులు . శ్రీనివాస్ రెడ్డి ఫోన్ కాల్ ఆధారంగా మరిన్ని వివరాలను కనుకున్నే పనిలో ఉన్నారు పోలీసులు..

అంతేకాకుండా అతని ఫేస్ బుక్ లో మొత్తం 600 మంది అమ్మాయలు ఉన్నారు. అతను ఫోన్ లో 60 మందితో టచ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు . హాజీపూర్ కి చెందిన ముగ్గురు అమ్మాయలు మాత్రమే కాకుండా శ్రీనివాస్ రెడ్డి ఇంకేంతమంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడన్నదానిపై పోలీసులు అతని దగ్గరి నుండి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. కానీ శ్రీనివాస్ రెడ్డి పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఉండడం వల్ల కేసును ముందుకు సాగడం లేదని పోలీసులు చెబుతున్నారు . ఈ నెల 13 వ తేది వరకు అతనిని కస్టడిలో ఉంచి వివరాలను రాబట్టాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు ..

Next Story