కల్లు కాంపౌండ్‌లో ఇద్దరు మహిళలతో పరిచియం పెంచుకున్న అతను చివరికి..

కల్లు కాంపౌండ్‌లో ఇద్దరు మహిళలతో పరిచియం పెంచుకున్న అతను చివరికి..
x
Highlights

లంగర్‌హౌజ్‌ పరిధిలో జరిగిన ఇద్దరు మహిళల హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసమే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు చాంద్రాయణగుట్ట...

లంగర్‌హౌజ్‌ పరిధిలో జరిగిన ఇద్దరు మహిళల హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసమే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు చాంద్రాయణగుట్ట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పనిచేసే అంకూరి గిరిని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

హైదరాబాద్ లో జరిగిన మహిళల డబుల్ మర్డర్ కేసును పోలిసులు ఛేదించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బరగూడెం గ్రామానికి చెందిన యాదమ్మ, సుమిత్రలు ఈనెల 21న కల్లు కోసం కంచన్ బాగ్ వెళ్లారు. వెళ్లిన కొంత సేపటికే వాళ్ల ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి అనంతరం అత్తాపూర్ మూసీ నదిలో శవాలై కనిపించారు. మొదట ఈ జంటహత్యలు నరబలిగా క్షుద్రపూజలు జరిపి అనంతరం ఇద్దరినీ చంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే బంగారం కోసమే నిందితుడు మహిళలను కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో సెల్‌ఫోన్, సీసీ కెమెరాల దృశ్యాలు కీలకంగా మారాయి. ఆభరణాల కోసమే ఈ హత్యలు జరిగినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. చాంద్రాయణగుట్ట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పనిచేసే అంకూరి గిరి కల్లు కాంపౌడ్ వద్ద పూజల పేరుతో అక్కా చెల్లెళ్ల తో మాటలు కలిపాడు అనంతరం వారిద్దరినీ హత్యచేసి మృతదేహాలను మూసీనదిలో పడేసినట్లు సీపీ వివరించారు.

నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గిరి వద్దనుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి సీసీ కెమెరాలు దోహదపడినట్లు సీపీ వివరించారు.. నగరాన్ని ఫ్రీ కైం సిటీగా మార్చేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories