టీవీ నటుడి భార్య..భర్తకు వీడియో కాల్ చేసి మరీ ఉరేసుకుంది!

టీవీ నటుడి భార్య..భర్తకు వీడియో కాల్ చేసి మరీ ఉరేసుకుంది!
x
Highlights

ఒక్కోసారి తేలికగా తీసుకున్న విషయాలు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అటువంటిదే ఈ సంఘటన. ప్రముఖ టీవీ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి (34) ఉరి వేసుకుని ఉసురు...

ఒక్కోసారి తేలికగా తీసుకున్న విషయాలు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. అటువంటిదే ఈ సంఘటన. ప్రముఖ టీవీ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి (34) ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలే దీనికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. రాయదుర్గం ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..

గుంటూరుకు చెందిన భారతికి.. మణికొండ పంచవటి కాలనీలో నివసించే టీవీ నటుడు మధుప్రకాశ్‌తో 2015లో వివాహమైంది. ఆమె నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అత్తమామలు, మరిది అందరూ కల్సి ఒకే ఫ్లాట్ లో నివసిస్తున్నారు. ఇటీవలి కాలంలో భర్త షూటింగ్ ల నుంచి ఆలస్యంగా వస్తుండడంతో తరచూ ఆమె భర్త మధు ప్రకాష్ తో గొడవ పడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మధు ప్రకాష్ జిమ్ కు వెళ్లి అటునుంచి అటే షూటింగ్ కు వెళ్ళిపోయారు. ఆ తరువాత కొద్దిసేపటికి భారతి తన భర్తకు వీడియో కాల్ చేసింది. ఈ కాల్ లో ఆమె తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దానిని తేలికగా తీసుకున్నారు మధుప్రకాష్. మంగళవారం రాత్రి 7:30 ప్రాంతంలో మధు ప్రకాష్ ఇంటికి వచ్చారు. బెడ్ రూమ్ తలుపు లోపల నుంచి గడియ పెట్టుకుని ఉండడంతో ఎంత కొట్టినా భారతి తలుపు తీయలేదు. దీంతో వేరే తాళంతో తలుపు తెరిచి చూసే సరికి భారతి చీరతో ఉరివేసుకుని మరణించి ఉండడం కనిపించింది. రాయదుర్గం పోలీసులు మృత దేహాన్ని మార్చురీకి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories