Top
logo

బంగారు గొలుసు మింగేసిన దొంగ ... బయటపెట్టిన అరటి, బొప్పాయి పండ్లు

బంగారు గొలుసు మింగేసిన దొంగ ... బయటపెట్టిన అరటి, బొప్పాయి పండ్లు
X
Highlights

రాజస్థాన్ లో అతనో దొంగ .. ఎప్పటిలాగే బికనీర్ అనే ప్రాంతంలో గంగాషహర్ వద్ద ఓ మహిళ మేడలో ఉన్న గొలుసును...

రాజస్థాన్ లో అతనో దొంగ .. ఎప్పటిలాగే బికనీర్ అనే ప్రాంతంలో గంగాషహర్ వద్ద ఓ మహిళ మేడలో ఉన్న గొలుసును దొంగిలించి పారిపోయాడు ... కంగారులో ఎక్కడ దొరుకుతానో అని భయం వేసి అ గొలుసుని మింగేసాడు . అనుకున్నట్టుగానే పోలీసులకి చిక్కాడు . ఇంకేముంది ఎప్పటిలాగే నేను అ దొంగతనం చేయలేదు అని చెప్పుకొచ్చాడు . కానీ పోలీసులు కూడా నమ్మలేదు .

అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఎక్స్ రే తీయించారు . అందులో ఓ గొలుసు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు . ఇప్పుడు అ గొలుసు ఎలా తీయాలి అనుకున్న టైంలో పోలీసులకు వైద్యులు సింపుల్ సలహా ఇచ్చారు . అతని చేత డజను అరటిపండ్లు, రెండు బొప్పాయి పండ్లు తినిపించాలని సూచించారు . ముందుగా తినడానికి మొండికి వేసిన అ దొంగ అ తరవాత పోలిసుల స్టైల్ లో నాలుగు పీకగా తిన్నాడు . అ పండ్లు వాటి పని అవి చేయగా మరునాడు గొలుసు పోలిసుల చేతికి వచ్చింది .

Next Story