Top
logo

ఈ జీవనశైలే వారిని హంతకులుగా మార్చింది

ఈ జీవనశైలే వారిని హంతకులుగా మార్చింది
Highlights

ప్రియాంక హత్య కేసులో నిందితులు చిన్న వయసులోనే లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేయడంతో చేతి నిండా డబ్బు ఉండేది....

ప్రియాంక హత్య కేసులో నిందితులు చిన్న వయసులోనే లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేయడంతో చేతి నిండా డబ్బు ఉండేది. దీంతో పూటుగా మద్యం తాగడం, విచ్చలవిడిగా తిరగడం ఈ జీవనశైలే వారిని నిందితులుగా మార్చింది. ప్రియాంకను హత్య చేసిన ప్రధాన నిందితుడు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్‌ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. పదో తరగతి వరకు చదివాక మహ్మద్‌ స్థానికంగా ఉన్న హెచ్‌పీ పెట్రోలు బంకులో చేరాడు. లారీ యజమాని శ్రీనివాస్‌రెడ్డి దగ్గర డ్రైవర్ గా చేరాడు. జీతంతో పాటు పలు రూపాల్లో నెలకు 30 వేలకు పైగా వచ్చేది. అడిగేవారు లేకపోవడంతో జల్సాలకు అదుపు లేకుండా పోయింది.

మహ్మద్ జల్సా జీవితం చూసి గుడిగండ్ల గ్రామానికి చెందిన శివ కూడా అతని దగ్గర క్లీనర్ గా చేరాడు. ఐదో తరగతితోనే చదువు మానేసిన శివ స్థానికంగా చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. అలా ఇద్దరూ కలవడంతో మరిన్ని జల్సాలకు మరిగారు. ఒకే లారీలో వెళ్లేవారు. స్టీల్‌రాడ్లను చాటుగా అమ్ముకునేవారు.

ఈ కేసులో మరో నిందితుడు గుడిగండ్లకు చెందిన చింతకుంట చెన్నకేశవులు. 9వ తరగతి వరకు చదివి జులాయిగా తిరుగుతున్న చెన్నకేశవులు సైతం లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఇతను కూడా స్టీల్‌రాడ్ల లారీలను నడిపించేవాడు. తన వద్ద క్లీనరుగా అదే గ్రామానికి చెందిన నవీన్‌ ను పెట్టుకున్నాడు. నవీన్‌ చరిత్ర కూడా దాదాపు ఇలాంటిదే. గ్రామంలో సైలెన్సరు లేని ద్విచక్రవాహనంపై తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడని తెలుస్తోంది.

Web TitleThe suspect lives turned them into murderers
Next Story