Top
logo

దారుణం.. మైనర్‌ బాలికపై మారు తండ్రి అత్యాచారం

దారుణం.. మైనర్‌ బాలికపై మారు తండ్రి అత్యాచారం
X
Highlights

ఎన్ని చట్టాలు తెచ్చినా ఎంత కఠిన శిక్షలు అమలు చేసినా ఈ మృగాళ్లలో మార్పు రావడం లేదు. దిశ ఘటనకు మరువక ముందే...

ఎన్ని చట్టాలు తెచ్చినా ఎంత కఠిన శిక్షలు అమలు చేసినా ఈ మృగాళ్లలో మార్పు రావడం లేదు. దిశ ఘటనకు మరువక ముందే సూర్యాపేట జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.16 సంవత్సరాల మైనర్‌పై వరుసకు మారు తండ్రైన దుర్మార్గుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి స్థానిక గొల్లబజారులో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆ మహిళకు అదే జిల్లా చివ్వేంల మండలం మున్య నాయక్ తండాకు చెందిన బానోత్ శ్రీనుతో పరిచయం ఏర్పడి అది కాస్త సహజీవనానికి దారి తీసింది.

చదువు మధ్యలో ఆపేసిన బాలిక తల్లితో కలిసి కూలీ పనులకు వెళ్ళేది. గత కొంత కాలంగా బాలికపై కన్నేసిన మారు తండ్రి బాలికను లైoగికంగా వేధిస్తున్నాడు. పది రోజుల క్రితం తల్లి కూలీ పనికి వెళ్లగా, ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో భయపడిన బాలిక తల్లికి చెప్పలేదు. దీనిని అలుసుగా తీసుకున్న ఆ నీచుడు పలుమార్లు తన దగ్గరకు రావాలని బెదిరిస్తూ ఉండటంతో బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కామందుడిని అరెస్ట్ చేశారు.

Web TitleTelangana: Man caught for Victimization on step-daughter in Suryapet
Next Story