Top
logo

హైదరాబాద్‌లో పేలుడు...

హైదరాబాద్‌లో పేలుడు...
X
Highlights

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అనుమానాస్పద పేలుడు సంభవించింది. వెంకటగిరిలోని ఆజాయ్ బార్ దగ్గర ఈ ఘటన జరిగింది....

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అనుమానాస్పద పేలుడు సంభవించింది. వెంకటగిరిలోని ఆజాయ్ బార్ దగ్గర ఈ ఘటన జరిగింది. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. సినిమా వాళ్లు ఏదైనా పేల్చారా? లేక సంఘవిద్రోహ శక్తుల కుట్రా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్‌ కూడా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించే పనిలో ఉంది. కాగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story