logo

బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..

బర్త్‌డేకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై..
Highlights

తల్లిదండ్రులు దేవతలకు ప్రతిరూపం అంటారు. కానీ, ఓ కలియుగ కుమారుడు బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదని...

తల్లిదండ్రులు దేవతలకు ప్రతిరూపం అంటారు. కానీ, ఓ కలియుగ కుమారుడు బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులకు నిప్పంటించాడు. ఈ దారుణాన్నిఅడ్డుకోబోయిన చెల్లెలికి, నాయనమ్మకు గాయాలయ్యాయి.

ఈ బైక్ పైనున్నయువకుడి పేరు ప్రసాద్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉండే ఇతడు ఇంటర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డాడు. బర్త్ డే పార్టీకి ప్రసాద్ డబ్బులు డిమాండ్ చేస్తే తల్లిదండ్రులు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ప్రసాద్ పెట్రోల్ తో ఆత్మహత్యా చేస్తుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. తామే చస్తామంటూ కొడుకు చేతుల్లో నుంచి పెట్రోల్ బాటిల్ లాక్కొని తమ ఒంటిపై వేసుకున్నారు. చస్తామన్నారు కదా చావండంటూ అగ్గిపుల్లతో నిప్పంటించి కొడుకు పారిపోయాడు.

మంటల్లో చిక్కుకున్న తల్లిదండ్రులను ప్రసాద్ చెల్లి, నాయనమ్మ కాపాడబోగా స్వల్ప గాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు గాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ప్రసాద్ తల్లిదండ్రులు నరకయాతన పడుతున్నారు. బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వని తల్లిదండ్రులకు నిప్పంటించిన కొడుకు ఉదంతం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top