Top
logo

అశ్లీల వెబ్‌సైట్లలో అత్త నంబర్ పెట్టిన అల్లుడు.. అరెస్ట్

అశ్లీల వెబ్‌సైట్లలో అత్త నంబర్ పెట్టిన అల్లుడు.. అరెస్ట్
X
Highlights

భార్యతో చీటికీమాటికీ గొడవలకు కారణం తన అత్తే అని భావించాడా అల్లుడు. దాంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు...

భార్యతో చీటికీమాటికీ గొడవలకు కారణం తన అత్తే అని భావించాడా అల్లుడు. దాంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు నీచంగా భావించాడు. ఆమె ఫోన్‌ నంబర్‌ను అశ్లీల వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశాడు. అప్పట్నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడటంతో మానసిక క్షోభకు గురైన అత్త పోలీసులను ఆశ్రయించడంతో అల్లుడి ఘనకార్యం బయటపడింది. వరంగల్ జిల్లా కమలాపూర్‌కు చెందిన దుబాసి సునీల్(33) ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ అమ్మాయిని 2017లో పెళ్లి చేసుకొని విశాఖపట్నంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఊరికే భార్యతో గొడవపడటంతో అత్త(59) నిలదీసేది. అసలు తమ ఇద్దరి మధ్య గొడవలకు తన అత్తే కారణమని భావించిన ఆ అల్లుడు.. ఆమె ఫోన్ నంబరును అశ్లీల వెబ్‌సైట్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చేవి. అసభ్యంగా మాట్లాడుతూ వేధించేవారు. తీవ్ర మానసిక క్షోభకు గురైన ఆ అత్త గురువారం రాచకొండ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు కూపీ లాగగా ఈ నిర్వాకాన్ని స్వయాన అల్లుడే చేస్తున్నాడని తెలిసి విస్తుపోవడం అత్తతోపాటు భార్య వంతైంది. ఈ మేరకు పోలీసులు సదరు నిందితున్ని శనివారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Next Story